సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున తర్వాత.. పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకోవడానికి ఎంతో మంది హీరోలు ఆరాట పడుతున్నారు. ఈ క్రమంలోని ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా రాణిస్తున్న వారిలో రామ్ చరణ్ ఒకరు. ఇక రామ్ చరణ్ నుంచి తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సినిమాను నిర్మించారు.
కియారా అధ్వని హీరోయిన్‌గా అంజలి మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఎస్.జే. సూర్య విలన్ పాత్రలో నటించారు. శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలో కనిపించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే గేమ్‌ఛేంజర్ నెగటివ్ టాక్ రావడంతో ఆక్యుపెన్సి తగ్గిపోయింది. ఇలాంటి క్రమంలో మెగా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలినట్లు అయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం.
నంద్యాల జిల్లా బనగానపల్లెలోని జిఎం పిక్చర్ ప్యాలెస్ సినిమా.. థియేటర్ ప్రభుత్వం నిబంధనల మేర లైసెన్స్ అనుమతులు తీసుకోకుండానే గేమ్ ఛేంజర్ సినిమాను ప్రదర్శిస్తున్నారని.. డోన్ ఆర్డిఓ వెల్లడించారు. ఈ క్రమంలోనే సినిమా థియేటర్ను కూడా సీజ్ చేశారు. అయితే తమ అభిమాన హీరో సినిమాలు థియేటర్లో సీజ్ చేయడంతో ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక యూవీ రిలీజ్ అయ్యి ఫస్ట్ షో తో నెగిటివ్ టాక్ రావడంతో ఇప్పటికే ఫ్యాన్స్‌లో నిరాశ మొదలైంది. ఇలాంటి క్రమంలో గేమ్ ఛేంజర్ థియేటర్ సీజ్ లింటి అడ్డంకులు ఏర్పడడం ఆడియన్స్ ను మరింత నీరాశపరుస్తుంది.