కొత్త తరహాలో సినిమాలను తెరకెక్కించి సక్సెస్‌లు అందుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటున్నాడు సుకుమార్. ఆయన సినిమాలో రెగ్యులర్, కమర్షియల్ సినిమాల కంటే కాస్త భిన్నంగా ఉంటూ అందరిని ఆకట్టుకుంటాయి. అలా.. ఆర్య సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన సుక్కు.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ రాణిస్తున్నాడు. ఇక ఆయన కథ వినిపించే తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుందట. కాగా నేడు సుకుమార్ 55వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా.. ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు సుకుమార్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సుకుమార్ సినీ కెరీర్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు.. ఆయన అభిమానించే హీరో ఎవరిని ప్రశ్న వైరల్ గా మారుతుంది.
ఇక సుకుమార్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయనకు చిన్నప్పటి నుంచే సినిమాలపై మంచి ఆసక్తి ఉందట. ఇక కాలేజీకి ఎంటర్ అయిన తర్వాత సినిమాలపై ఆసక్తి మరింతగా పెరిగిందని.. అయితే సుకుమార్ సినీ రంగంలోకి అడుగు పెట్టడానికి స్ఫూర్తినించింది మాత్రం ఓ సీనియర్ హీరో అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సుకుమార్ లాంటి డైరెక్టర్‌కి స్ఫూర్తి కలిగించే హీరో అనగానే చిరంజీవి, బాలయ్య, ఎన్టీఆర్, రజనీకాంత్, శోభన్ బాబు, కృష్ణ లాంటి స్టార్ హీరోలని అంతా భావిస్తారు. కానీ అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇంతకి ఆ హీరో ఎవరో కాదు.. యాంగ్రీ యంగ్ మాన్ గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రాజశేఖర్. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సుక్కు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్టు వెల్లడించారు.
కాలేజ్ డేస్ లో ఉన్న క్రమంలో రాజశేఖర్ సినిమాలు ఎక్కువగా చూసే వాడినని.. అంకుశం ,ఆహుతి ,తలంబ్రాలు, మగాడు లాంటి ఎన్నో సినిమాలు చూసి రాజశేఖర్ కి ఆయన అభిమానిగా మారినట్టు సుకుమార్ వెల్లడించాడు. ఇక రాజశేఖర్ మ్యానరిజంతో సుక్కు కాలేజీలో డైలాగులు చెబుతూ పర్ఫామెన్స్ చేస్తుండే వాడట. ఈ క్రమంలో సుకుమార్ పర్ఫామెన్స్‌ను అందరు మెచ్చుకునే వారని.. దీంతో సుకుమార్‌కు సినీ రంగంపై మరింత ఆసక్తి పెరిగిందని తెలుస్తుంది. తను కూడా సినిమాల్లోకి వచ్చి ఏదైనా సాధించాలని.. సాధించగలనని నమ్మకంతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను సుకుమార్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాల్లోకి రావడానికి ఇన్ డైరెక్ట్ గా రాజశేఖర్ ఒక కారణమని సుకుమార్ చేసిన కామెంట్స్‌తో అర్థమవుతుంది.