తెలుగు స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుని సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల సమంత టాలీవుడ్ లో పెద్దగా సినిమాలు చేయకపోయినా.. అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. దానికి కారణం తన వ్యక్తిగత విషయాలను, తన ఇష్టా, అఇష్టాలను అభిమానులతో షేర్ చేసుకోవడమే. సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఈ అమ్మడు.. డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఉండాలని సినిమాలకు వరుసగా కమిట్ అవుతూ వచ్చింది.
అయితే ఈ సినిమాలో షూటింగ్ టైంలో మయోసైటీస్ వ్యాధికి గురవడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ వ్యాధి నుంచి బయటపడడానికి చాలా కాలం ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఇటీవల ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న ఈ అమ్మడు.. మళ్ళీ పలు సినిమాల్లో, సిరీస్ లో నటిస్తూ బిజీగా గడుతుంది. దీంతోపాటే తన సొంత బ్యానర్ ట్రలాల మూవీస్ స్థాపించి అందులోనూ ఓ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తెలుగులో చివరగా ఖుషి సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన సమంత.. వెండితెరపై కనిపించి చాలా కాలం అయింది.
అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అలా తాజాగా ఆమె చేసిన ఎమోషనల్ పోస్టు వైరల్‌గా మారుతుంది. సమంతా మరో వ్యాధి బారిన పడిందట. తాజాగా సోషల్ మీడియా వేదికగా సమంత ఎమోషనల్ పోస్టును షేర్ చేసుకుంది. ఇన్‌స్టా వేదికగా.. ఓ స్టోరీని తాను వర్కౌట్ చేస్తున్న పిక్‌తో జోడించి పెట్టింది. చికెన్‌గునియా వల్ల వచ్చిన కీళ్ల నొప్పుల నుంచి కోలుకోవడం చాలా ఫన్నీగా ఉంటుందంటూ సాడ్ ఎమోజిని షేర్ చేసుకుంది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో సమంత ప్రస్తుతం దానివల్ల ఇబ్బంది పడుతుందా అంటూ అభిమానులలో టెన్షన్ మొదలైంది. ఇక సమంతకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.