సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సరికొత్త ట్రైండ్ నడుస్తుంది. ఓ సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తర్వాత.. సినిమా కలెక్షన్‌లు ఏ రేంజ్‌లో వచ్చాయో ఫస్ట్ డే కలెక్షన్స్ నుంచే నుంచి పోస్టర్ ద్వారా మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం ట్రెండ్ గా మారిపోయింది. అయితే.. నిజమైన లెక్కలా.. లేదా ఆడియన్స్‌లో హైప్ పెంచేందుకు ఫేక్ లెక్కలు వేస్తున్నారా.. అనేదానిపై మాత్రం చాలాసార్లు ఆడియన్స్‌లో సందేహాలు నెలకొంటున్నాయి. అవి నిజమైన లెక్కలు అయితే పర్లేదు. కానీ.. కొంతమంది అత్యుత్సాహంతో వాటిని డబల్ కలెక్షన్స్ లా వేసి చూపిస్తూ హైప్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆడియన్స్ భావిస్తున్నారు. ఇలాంటి క్రమంలో సోషల్ మీడియాలో ఓ న్యుస్ హాట్ టాపిక్‌గా మారింది.
జనవరి 10న రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ సినిమాను చూసి చాలామంది నుంచి నెగటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసింది. సినిమా అస్సలు బాలేదంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక సినిమా ఫస్ట్‌డే కలెక్షన్స్ సంబంధించి హిందూ టైమ్స్ న్యూస్ వాళ్ళు తాజాగా గేమ్ ఛేంజర్ 50 కోట్ల కలెక్షన్లు కూడా రాబట్ట లేకపోయిందంటూ వెల్లడించారు. అయితే యూనిట్ సభ్యుల మాత్రం మొదటి రోజు గేమ్ చేజర్ రూ.186 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిందంటూ తాజా పోస్టర్ తో వెల్లడించారు. అయితే ఈ పోస్టర్ చూసిన చాలామంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. అసలు వంద కోట్లు కూడా దాటని ఇలాంటి సినిమాలు ఎందుకిలా తప్పుడు ప్రచారాలు చేస్తూ హైప్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని.. సినిమాకు రూ.90 కోట్లు కూడా రాని మూవీకి ఏకంగా రూ.156 కోట్లు పోస్టర్ వేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.
అంతేకాదు.. సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో.. అన్ని కోట్లతోనే పోస్టర్ రిలీజ్ చేయాలి కానీ.. టాక్ బాగోలేని నెగటివ్ రివ్యూస్ వచ్చిన ఇలాంటి సినిమాకు.. ఆక్యుపెన్సి కూడా పూర్తికాని ఇలాంటి మూవీ విషయంలో.. ఎక్కువ కోట్లు లెక్క పెట్టి పోస్టర్లు రిలీజ్ చేస్తే ఎలా.. దేవర సినిమాకి ఫస్ట్ డే రూ.131 కోట్లు వస్తే 41 కోట్లు యాడ్ చేసి.. ఏకంగా రూ.172 కోట్లని ఫేక్ పోస్టర్లు పెట్టారు. ఇప్పుడు మరోసారి గేమ్ ఛేంజర్ విషయంలోనూ ఇలాగే ఫేక్ పోస్టర్లు వేసి జనాన్ని మోసం చేస్తున్నారు అంటూ.. గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఫేక్ ప్రచారం అంటూ.. ఇలా మేకర్స్ ఏ తమ సినిమాకు ఫేక్ కలెక్షన్లను అనౌన్స్ చేసుకుంటే ముందు ముందు నమ్మకం కోల్పోయి ఆ సినిమాలు చూడడానికి కూడా జనం ఎవరూ రాకుండా పోతారు అంటూ.. అసలు కలెక్షన్స్ విషయాన్ని పట్టించుకోవడమే మానేస్తారు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.