సుకుమార్ – ప్రభాస్ కాంబోలో బ్లాక్ బస్టర్ మిస్ అయిందని తెలుసా.. ప్రభాస్ రిజెక్ట్ చేశాడా..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో ఒకరుగా సుకుమార్ ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడుగా సుకుమార్ యాక్షన్ రంగంలోకి దిగితే మేము ఎవరం ఆయన ముందు నిలబడలేమని దర్శకుడు రాజమౌళి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. సుక్కు టాలెంట్ గురించి అప్పట్లోనే జక్కన్న చేసిన కామెంట్స్ ను సుకుమార్ నిజం చేసి చూపించారు. ప్రస్తుతం తన సినిమాలతో సంచలనాలు క్రియేట్ చేస్తున్న సుకుమార్.. నాన్నకు ప్రేమతో సినిమా వరకు హైలి ఇంటిలిజెంట్ గా ఉండే కథలను తెర‌కెక్కించేవాడు. ఇక సుకుమార్ లెక్కల మాస్టర్ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సినిమాలు అర్థం క‌వ్వాలంటే మినిమం బీటెక్ ఉండాలి.. లేదా మ్యాథ్స్‌లో జేమ్స్ అయి ఉండాలి అన్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తం అయ్యేవి.

Arya (2004) - IMDb

కానీ.. జక్కన్న చేసిన కామెంట్స్ తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన రంగస్థలం ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో.. ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు పుష్ప 2తో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించి దూసుకుపోతున్నాడు సుకుమార్. అయితే సుక్కు త‌న సినీ కెరీర్‌లో మహేష్, చ‌ర‌ణ్‌, తార‌క్‌, బ‌న్నీ, చైతూ, రామ్ ఇలా ఎంతో మంది హీరోలతో సినిమాలు తరికెక్కించాడు. కానీ ప్రభాస్ తో మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే సుకుమార్ తన మొట్టమొదటి సినిమా ప్రభాస్‌తోనే చేయాలని భావించాడట. సుకుమార్ ఆర్య సినిమాతో ఇండస్ట్రీలోకి డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా మొదట ఆర్య సినిమా కథ ప్రభాస్ తో చెప్పాడట. అప్పటికే ప్రభాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు. ఇలాంటి క్రమంలో సుకుమార్ చెప్పిన ఆర్య కథను విన్న ప్రభాస్ తనకు కథ సెట్ కాదని చెప్పేసారట.

Prabhas Opens Up About What Inspired Him To Enter The Acting Industry

సుక్కు ఎంత కన్విన్స్ చేయాలని చూసినా ప్రభాస్ మాత్రం ఇలాంటి క్రేజీ లవ్ స్టోరీ లో నేను చేస్తే ఆడియన్స్ కు నచ్చదని చెప్పేసాడట. దీంతో సుక్కు.. ప్రభాస్ కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయింది. సుక్కు ఈ కథను బన్నీకి చెప్పడం త‌న‌కు బాగా న‌చ్చ‌డంతో ఆ మూవీ నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో పుష్ప 2 తెరకెక్కి సంచలనాలు సృష్టించింది. ఇక ప్రభాస్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు క్రియేట్ చేస్తుంటే.. సుకుమార్ నుంచి వచ్చిన పుష్ప 2తో ప్రభాస్.. బ్లాక్ బాస్టర్ రికార్డులను అన్నింటిని బ్రేక్ చేసింది. అంతేకాదు టాలీవుడ్ సినిమాల హైయెస్ట్ కలెక్షన్లు అన్నింటినీ బ్రేక్ చేస్తూ సంచలనం సృష్టించింది. ఇలాంటి క్రమంలో సుకుమార్, ప్రభాస్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాల లైనన్తో బిజీగా ఉన్నారు. ఇలాంటి క్రమంలో వీరిద్దరు కాంబోలో సినిమా రావడం కష్టమే. అయినా.. ఫ్యూచర్‌లో అయినా వీళ్ళ కాంబోలో సినిమా వస్తే మాత్రం పుష్ప 2ని మించి రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.