నందమూరి నటసింహం బాలకృష్ణకు టాలీవుడ్‌లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య ఇంట్రెస్టింగ్ హిట్ సినిమాలు లిస్ట్‌లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు కూడా ఉంటాయి. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. ఓ రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టాయి. టాలీవుడ్ ఇండస్ట్రియల్ హిట్లుగా నిలిచాయి. అయితే తాజాగా బాలకృష్ణ.. బాబీ డైరెక్షన్‌లో డాకు మహారాజ్ రూపొందింది. ఇక ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌటేల ముగ్గురు హీరోయిన్లుగా కనిపించనున్నారట.
https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn:ANd9GcQ-bq91Pvao8BCgYyHoHkFOD2bYZZN5niAiqQ&s
ఇక డాకు మహారాజ్ సినిమా మరి కొద్ది గంటల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. డైరెక్టర్ బాబీ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. బాబీ మాట్లాడుతూ.. బాలయ్య కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌లుగా నిలిచిన సమరసింహారెడ్డి, నరసింహా నాయుడు సినిమాల రేంజ్‌లో డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో మరింత అంచనాలను పెంచేశాడు.
ఇక ఈ రెండు సినిమాల్లోని ముగ్గురు హీరోయిన్లు ఉంటారు అన్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే డాకు మహారాజులోను ఈ ముగ్గురు హీరోయిన్ల ఫార్మల ఉపయోగించాడట. ఇక బాలయ్య తో బాబీ బ్లాక్‌బస్టర్ సినిమా కొట్టేందుకు ఈ రెండు సినిమాల రిఫరెన్స్లను బాగా వాడినట్లు తెలుస్తుంది. కచ్చితంగా ఈ సినిమా కూడా అదే రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందని.. బాలయ్య ఫ్యాన్స్ కూడా నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఈ సినిమాతో బాలయ్య సరికొత్త హ్యాట్రిక్ కు నాంది పలుకుతాడని.. కలెక్షన్లతో రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా అవుట్ ఫుట్ ఎలా వచ్చిందో తెలియాలంటే మరి కొద్దిసేపు వేచి చూడాల్సిందే.