నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గాడ్ ఆఫ్ మాసస్ గా సరికొత్త ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే.. బాబి కూడా అదే బిరుదుతో బాలయ్యను పిలుస్తాడు. ముఖ్యంగా బాబి తెరకెక్కించిన లెటెస్ట్ మూవీ డాకు మహరాజ్ సినిమాలో.. బాలయ్య ఎంతో అద్భుతంగా నటించారని.. ప్రతి ఒక్కరిని గౌరవం ఇస్తూ సినిమా సెట్ లో వ్యవహరించారని మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్య జోడిగా.. ప్రగ్యా, శ్రద్ధ, ఊర్వశి నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్లు కూడా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
బాలయ్యతో ఎప్పుడూ చూడని, వినని రేంజ్‌లో డైలాగులు.. మాస్ కంటెంట్‌తో ఆకట్టుకునేలా డైరెక్టర్ బాబి సినిమాను రూపొందించినట్లు తెలుస్తుంది. మరికొన్ని గంటల్లో డాకు మహారాజ్ సినిమా ధియేటర్‌లలో ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ సందర్భంలోనే మీడియాతో డైరెక్టర్ బాబీ మాట్లాడారు. బాలయ్య గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చిన ఆయన.. సినిమా షూటింగ్ చాలా శాతం జైపూర్ లోనే చేసామని.. అక్కడ చాలా సన్నివేశాలు రూపొందించామంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా హార్స్ రైడింగ్ సన్నివేశాలన్నీ అక్కడే తెరకెక్కించామని.. హైదరాబాద్ నుంచి రావాల్సిన గుర్రం అప్పటికి రాలేదని.. ఇక ఆలస్యం చేయడం ఇష్టం లేక లోకల్‌లో ఉండే ఓ గుర్రాన్ని తెప్పించుకున్నాం అంటూ వివరించాడు.
అయితే అది ఓ మ్యాడ్ గుర్రం. అప్పటికే తన సొంత యజమానినే రెండుసార్లు కింద పడేసిందని.. డైరెక్టర్ బాబీ వివరించాడు. ఈ విషయాన్ని విన్న ఫైట్ మాస్టర్ వెంకట్ కూడా బాలయ్యకు విషయం చెప్పారట. అయితే బాలయ్య అలాంటివి ఏమీ పట్టించుకోకుండా ఈ గుర్రాన్ని డొక్కలో ఒక్క తన్ను తన్ను పైకి ఎక్కి మరి హార్స్ రైడింగ్ చేశాడని.. అది చూసి అందరం ఒక్కసారిగా షాక్ అయ్యాం అంటూ డైరెక్టర్ బాబి వివరించాడు. దీంతో.. దెబ్బకి గుర్రం సెట్ అయిపోయిందట. ఈ పని వల్ల సినిమా షూటింగ్ కూడా ట్యాగ్ కాకుండా త్వరగా పూర్తయిందని డైరెక్టర్ బాబి వివరించాడు. ప్రస్తుతం బాబీ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.