డాకు మహారాజ్ ట్విట‌ర్ రివ్యూ.. బాల‌య్య మాస్ జాత‌ర అదుర్స్‌..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా, డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రైటెలా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక బాబి డియోల్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా నేడు గ్రాండ్‌ లెవెల్లో రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ఓవ‌ర్సిస్‌లో సినిమా బెనిఫిట్స్ షోలు పూర్తయాయి. ఇక సినిమా చూసిన ఆడియన్స్ రివ్యూ ఇస్తున్నారు. కొందరు బ్లాక్ బ‌స్టర్ హిట్ అంటూ చెప్తుంటే.. మరికొందరు నుంచి మిక్స్డ్ టాక్ వస్తుంది. అసలు సినిమా ఎలా ఉందో పబ్లిక్ టాక్ ఏంటో.. ఒకసారి చూద్దాం.

డాకు మహారాజ్ ఫస్టాఫ్ చాలా బాగుంది, సెకండ్ హ‌ప్ ఫ్లాష్‌ బ్యాక్ అయ్యే వరకు కూడా అద్భుతంగా ఉంది. ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్లు కాస్త అక్కడక్కడ సాగదీసినట్లు అనిపించినా.. బాలయ్య కోసం బాబీ రాసుకున్న సీన్లకు.. ఆయన ఇచ్చిన ఎలివేషన్స్ అదుర్స్ అంటూ ఇక థ‌మ‌న్.. టీం త‌న‌పై పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిలబెట్టుకున్నాడని.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్ అంటూ చెబుతున్నారు. టెక్నికల్గా ఈ సినిమా చాలా బాగుందట.

మరొకరు.. బాలయ్యని కొత్తగా చూపించడంలో బాబీ సక్సెస్ సాధించాడ‌ని.. బాలయ్యను స్టైలిష్‌గా, సెటిల్ గా చూపించార‌ని రాసుకొచ్చారు. మాస్ ఆడియన్స్ పిచ్చెక్కెలా సీన్లను బాబి డిజైన్ చేశాడని చెప్తున్నారు. అయితే కథలో సస్పెన్స్ ఎక్కడా అనిపించలేదని.. నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆడియన్స్‌కు టక్కున అర్థమయిపోతుంది. చివరి 30 నిమిషాలు అయితే మరి బోరింగ్ గా ఉంటుందంటూ వివరించారు. ఇక మరో నెటిజన్ నాకు ఫస్ట్ అఫ్ బాగా నచ్చేసింది. సెకండ్ హాఫ్ డబ్బులు మాత్రం రిట‌ర్న్ చేసేయ్ అంటూ కామెంట్లు చేసారు.

ఇంకొకరు ఈ మూవీ బాలయ్య ఎలివేషన్ షాట్స్ గురించి గొప్పగా వర్ణిస్తూ ట్రైలర్లో చూపించిన సీన్ సీతారాం నుంచి.. డాకుకి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే షాట్లలో.. మహారాజ్ హెడ్ కి సీతారాం హెడ్ సెట్ అయ్యేలా కింద నుంచి అలా షార్ట్ పైకి తీసుకెళ్లారు.. ఆ షార్ట్ వచ్చినప్పుడు థియేటర్లలో గూస్ బంప్స్ ఖాయం అంటూ వివరించాడు. ఇలా ఇప్పటివరకు వచ్చిన పబ్లిక్ టాక్‌ను బట్టి డాకు మహారాజ్ ఫస్ట్ ఆఫ్ అదిరిపోయిందని. స్క్రీన్ ప్రజన్స్‌, బాబీ డైరెక్షన్, ఎలివేషన్స్ ప్రేక్షకులను మెప్పించినట్లు తెలుస్తుంది. ఇండియన్ స్క్రీన్ మీద ద బెస్ట్ విజువల్స్ గా డాకు మహారాజ్ విజువల్స్ ఉంటాయట. థ‌మన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ లో బాలయ్య మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అయినట్లే కనిపిస్తుంది. అయితే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ మహారాజ్ అసలు సిసలు దండయాత్ర.. ఇండియలో షోలు పడ్డ తర్వాత కనిపిస్తుందని.. థియేటర్లు ద‌ద్ద‌రిల్ల‌డం ఖాయం అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఆనందంగా ట్వీట్లు చేస్తున్నారు.