పరిచయం :
నందమూరి నటసింహం బాలకృష్ణ బాబి కాంబోలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతుల హీరోయిన్లుగా.. బాబీ డియేల్ విలన్ పాత్రులో నటించిన ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇక సినిమా కొద్ది సేపటి క్రితం గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ నాలుగు గంటల బెనిఫిట్ షోలు పూర్తయ్యాయి. సినిమా ఎలా ఉందో.. బాలయ్య ఊచకోత సృష్టించడో లేదో రివ్యూలో చూద్దాం.
స్టోరీ :
నానాజీ (బాలకృష్ణ) ని మదనపల్లి హిల్స్ స్టేషన్‌లో సంపన్న కుటుంబానికి చెందిన యువతిని రక్షించేందుకు నియమిస్తారు. మరోపక్క సీతారాం (బాలకృష్ణ) మరియు అతని భార్య (ప్రగ్యా జైశ్వాల్) మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతంలోని నీటిపారుదల ఇంజనీర్లుగా విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ ప్రాంతంలో శక్తివంతమైన ఠాకూర్ కుటుంబం చాలా ఇస్తూ ఉంటారు. వీరు మార్బుల్ మైనింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తారు. ఇక గ్రామస్తులు ఆ ప్రాంతంలో తీవ్రమైన నీటి కొరతతో సతమతమవుతూ ఉంటారు. అలాంటి సమయంలో సీతారాములు వారికి అండగా నిలిచి ఉగ్ర మహారాజుగా మారతాడు. అల సీతారాం మరియు ఠాగూర్ కుటుంబానికి మధ్య జరిగే తీవ్ర సంఘర్షణ నేపథ్యంలోనే మిగతా కథ నడిచింది.
విశ్లేషణ:
ప్రీ రిలీజ్ టైం లో మేకర్స్ తెలుగు ఆడియోస్ కోసం జైలర్, విక్రమ్ తరహాలో సినిమాను రూపొందించమంటూ వెల్లడించారు. ఇదో పబ్లిసిటీ స్టంట్ అని చాలామంది భావించిన.. మేకర్ చెప్పిందే నిజమైంది. డాకు మహారాజ్ ఫైనల్ అవుట్ పుట్ ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకుండా రూపొందించినట్లు క్లియర్ గా తెలుస్తుంది. కథలో కొత్తదనం లేకపోవడం.. ఊహించినట్లుగా సినిమా ఉండడం కాస్త సినిమాకు మైనస్ అయినా.. కథ మాత్రం ఆకట్టుకునేలా డిజైన్ చేశాడు. అయితే సినిమా మొదటి పదినిమిషాలు కాస్త షేక్ అయినట్లు అనిపించినా.. వెంటనే కథ ఊపందుకుంది . మెల్లమెల్లగా హై గేర్ లోకి మారింది. ఫ్రీ క్లైమాక్స్ వరకు స్టోరీ అదే వేగాన్ని కొనసాగించింది.
అయితే క్లైమాక్స్ ఫ్లాట్ గా ఉండడంతో.. అందరూ సస్పెన్స్ ఫీల్ అయ్యేలా చేయడంలో ఫెయిల్ అయినట్లు అనిపించింది. ఇక సినిమాతో మాస్‌ని ఆకట్టుకునేలా స్టైలిష్ కంటెంట్‌ని రూపొందించడం ఛాలెంజింగ్ టాస్క్. ఇందులో బాబీ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అతను ఆడియన్స్‌ను సీట్ ఎడ్జ్ లోకి తీసుకురావడంలో, ఆడియన్స్ కు విషువల్ ట్రీట్ ఇవ్వడంలో సక్సెస్ సాధించాడు. స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నప్పటికీ.. ఇంకా కథను మరింత క్రియేటివ్ గా బాబి రాసిఉండొచ్చు అనిపించింది. చాలా సన్నివేశాలు ఊహించినట్లుగానే జరిగాయి.
ఇంటర్వెల్ బ్యాక్ మరియు సెకండ్ హాఫ్ ఠాగూర్ ప్యాలెస్, ఇసుక తుఫాన్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయం. ఇక బాలకృష్ణ నానాజీ, ఇటు డాకు మహారాజ్ పాత్రలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఆయన భారీ డైలాగ్స్ కు కాస్త దూరంగా ఉంటూనే.. చక్కటి బ్యాలెన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక బాబి డియోల్ ఠాగూర్ రోల్‌లో స్టైలిష్ గా.. అలాగే పవర్ఫుల్ గా కనిపించాడు. ఇక ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ సెకండ్ హాఫ్ లో చిన్న పాత్రలైనా కీలకపాత్రలో మెప్పించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గలేదు. ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నాగ వంశీ రూపొందించినట్లు సినిమా చూసే ఆడియోస్ కు క్లియర్ గా అర్థమవుతుంది.
టెక్నికల్ గా:
ఇక విజయ్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది. అఖండ వారసత్వాని.. మరోసారి బాలయ్య తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ద బెస్ట్ అందించాడు.
ప్లస్ లు:
బాలయ్య రెండు పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ నటించడం సినిమాకు ప్లస్. ఇక స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్, సినిమా విజువల్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా కలిసొచ్చే అంశాలు.
మైనస్ లు:
కథ ఊహించదగినట్లుగా రూపొందించడం, క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు సినిమాకు మైనస్ పాయింట్.
చివరిగా:
డాకు మహారాజ్ ఆడియన్స్‌ను మెప్పించేలా.. స్ట్రాంగ్ స్టోరీ రూపొందించారు. థమన్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే ప్రేక్షకులను మెప్పించింది. కీలక సన్నివేశాల్లో మాస్ జాతర అదిరిపోయింది. అయితే కథ ను ఊహించినట్లుగా డిజైన్ చేయడంతో ద్వితీయార్థంలో సినిమా కాస్త తడిపడినట్లు అనిపించింది. బాబి బలమైన సంఘటనలను డిజైన్ చేయడంలో ఫెయిలయ్యాడు. ఇక క్లైమాక్స్ ఆడియన్స్‌ను నిరాశ పరుస్తుంది. కేవలం బాలయ్య నటన, థమన్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కారణంగానే క్లైమాక్స్ సాధరణ స్థాయికి ఎదగడానికి కారణం అనిపిస్తుంది.
రేటింగ్: 3/5