టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తాజాగా రిలీజ్ అయిన మూవీ డాకు మహారాజ్. తాజాగా సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌లుగా ఊర్వశి రౌతుల కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాల్లో బాబి డియోల్ విలన్ పాత్రలో కనిపించాడు. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఇక ప్రస్తుతం ధియేటర్లలో ఈ మూవీ సందడి చేస్తున్న సంగతి తెలిసింది.
కాగా సినిమా రిలీజ్ కంటే ముందే ఓటీటీ డీల్స్ ముగించుకున్నారు మేకర్స్. ఇక మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమాలను తమిళ్, హిందీ వర్షన్‌లు కూడా కొద్ది రోజుల్లో థియేటర్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా తెలుగుతోపాటు మిగతా భాషల డిజిటల్ హక్కులను కూడా నెట్ ఫిక్స్ సొంతం చేసుకుంది. శ్రీకర స్టూడియోస్, సీతారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.
ఇక ఇప్పటివరకు దాదాపు ఈ సంస్థలో రూపొందిన సినిమాల హక్కులన్నీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా డాకు మహారాజ్ హక్కులు ఈ సంస్థకే దక్కాయి. సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది అంటూ విలన్‌గా బాబి డియోల్ మెప్పించాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకోవాలనే అశక్తి అందరిలో నెలకొంది. అయితే సినీ వర్గాల అంచనా ప్రకారం.. ఈ సినిమా ఓటీటీ స్ట్రిమింగ్ ఈనెలాఖరుకు.. లేదా వచ్చేనెల ప్రారంభంలో ఉండనుందట.