నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా, బాబి కొల్లి డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ డాకు మహరాజ్. సంక్రాంతి రేసులో రిలీజ్ అయిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమాతో బాలయ్య మరోసారి బ్లాక్ బస్టర్ కొడతాడంటూ నందమూరి అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. శ్రీకర స్టూడియో, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇక దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు ముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పింది.
ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ లెవెల్ లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్‌కు రూ.84 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా.. ఏపీ, నైజాంలో కలిపి రూ.73 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అందులో రూ.21 కోట్లు నైజాం ఏరియాకు అమ్ముడుపోయిందని.. మిగతా రూ.51 కోట్లు ఏపీలో బిజినెస్ జరుపుతుందని తెలుస్తుంది. ఇందులో సీడెడ్ రూ.16 కోట్లు, ఆంధ్రాలో రూ.35 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం.
ఇక ఆంద్రలోని.. ఉత్తరాంధ్రలో రూ.8.40 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.6.30 కోట్లు, వెస్ట్ లో రూ. 5 కోట్లు, కృష్ణ రూ.5.60 కోట్లు, గుంటూరు రూ.7.20 కోట్లు, నెల్లూరు రూ.2.80 కోట్ల వరకు బిజినెస్ జరుపుకొందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.73 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక బాలయ్య కెరీర్‌లోనే హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న సినిమాగ డాకు మహారాజ్ నిలిచింది. అలా ప్రపంచ వ్యప్తంగా దాదాపు రూ.80 కోట్లకు పైగా బడ్జెట్ తో అమ్ముడుపోయిన ఈ సినిమా.. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.190 కోట్ల గ్రాస్ సాధించాలని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఉన్న టాక్ రిత్యా ఈ రిజల్ట్ అందుకోవడం బాలయ్యకు సాధ్యమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.