డాకు మహారాజ్ రిలీజ్.. బాబి ఎమోష‌న‌ల్‌..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ బాబి కాంబోలో తెర‌కెక్కి సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన తాజా మూవీ డాకు మహారాజ్. శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌లుగా ఊర్వశి రౌతెల కీలక పాత్రలో నటించిన ఈ సినిమాల్లో బాబి డియోల్ విలన్ పాత్రలో కనిపించాడు. ఎస్ఎస్ థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఇక శ్రీకర స్టూడియోస్‌, సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక.. తాజాగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సినిమాల్లో బాలయ్య డ్యూయల్ రోల్ బ్యాలెన్స్ చేసుకుంటూ త‌న న‌ట‌న‌తో అదరగొట్టాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్. ఎస్‌. థ‌మన్ మ్యూజిక్ వేరే లెవెల్‌లో ఉందట. ఇలా ప్రస్తుతం సినిమా చూసిన అంద‌రు దాదాపు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. మరి కొంతమంది మాత్రం సెకండ్ హాఫ్ ఊహించినట్లుగానే ఉంద‌ని.. పెద్దగా సస్పెన్స్ లేకుండా ఉందని.. క్లైమాక్స్ నిరాశ ప‌రిచిందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో డాకు మహారాజ్ రిలీజ్‌ను ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ డైరెక్ట‌ర్ బాబి ఓ ఎమోషనల్ ట్విట్ చేశారు.

ఇద్దరూ పని రాక్షసులే..-Namasthe Telangana

బాబి తన ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతూ.. ఇవాళ చిత్ర యూనిట్‌కు చాలా ప్రత్యేకమైన రోజు. రెండేళ్లుగా అభిమానుల అంచనాలు, ఎమోషన్లు, ఊహలను అందుకోవాలని నేను కన్న కల‌లు అన్నీ చేరుకునే రోజు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా బాలయ్య అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని.. ఈ సినిమాకు పనిచేసిన యూనిట్ స‌బ్యుల‌కు నా ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాబీ చేసిన ఎమోషనల్ కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి.