డాకు మహారాజ్ హిట్ టాక్.. బాలయ్య కోసం మ్యాన్‌షన్ హౌస్‌తో ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం టాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఎంతోమంది బాలయ్య సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. బాలయ్యను అభిమానిస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో తాజాగా బాలయ్య నుంచి రిలీజ్ అయిన మూవీ డాకు మహారాజ్. యంగ్‌ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్‌ను పలకరించింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా యుఎస్‌లో బాలయ్యకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉండడం విశేషం. అక్కడ తెలుగు రాష్ట్రాల కంటే కొద్ది గంటల ముందే బెనిఫిట్స్ పూర్తయిపోయాయి. దీంతో సినిమా చూసిన అభిమానులు అక్కడ సెలబ్రేషన్స్ మొదలు పెట్టేసారు. ప్రస్తుతం వారి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ వైరల్ గా మారుతున్నాయి.

ఈ సినిమాతో వరుసగా నాలుగో సారి బాలయ్య బ్లాక్ బస్టర్ అందుకోనున్నాడని.. సినిమాల్లో ఆయన యాక్షన్ అదుర్స్ అంటూ ఎపటిలాగే పవర్ ఫుల్ డైలాగ్స్, ఆడియో.. ఫుల్ మీల్స్ లా అనిపించాయని సినిమా మాస్ జాత‌ర‌ అంటూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే డాకు మహారాజ్ ఫస్ట్ షో పూర్తి అయిన వెంటనే ధియేటర్ల నుంచి బయటకు వచ్చిన బాలయ్య, టీడీపీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బాలయ్య కటౌట్‌కు మెన్షన్ హౌస్ అభిషేకం చేస్తూ.. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆ వీడియో నెటింట ట్రెండ్ అవుతుంది.