నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా థియేటర్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో అభిమానులకు షాక్ తగిలింది. డాకు మహరాజ్ సినిమా రిలీజ్ క్రమంలో బాలయ్య ఫ్యాన్స్ ధర్నా చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మార్కాపురం శ్రీనివాస థియేటర్ ముందు బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులంతా కలిసి ధర్నాకు దిగారు. డాకు మహారాజ్ సినిమాపై ఇప్పటివరకు క్లారిటీ లేదని మండిపడ్డారు. థియేటర్ యజమాన్యాలు సిండికేట్ గా మారాయని ఫ్యాన్స్ ఆవేదనను వ్యక్తం చేశారు.
కొందరు కావాలనే ఇలా చేస్తున్నారని అభిమానులు మండిపడ్డారు. కానీ.. తర్వాత అభిమానులతో చర్చలు జరిపినా మార్కాపురం శ్రీనివాస్ థియేటర్ యాజమాన్యం.. సినిమా వేయడంతో బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు రిలాక్స్ అయ్యారు. దీంతో.. పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇదిలా ఉంటే సినిమా నేడు ఉదయం రిలీజ్ కాగా.. ఇప్పటికే సినిమాను చూసిన ఆడియన్స్ అందరూ స్టోరీ రొటీన్ గా ఉన్నా.. బాలయ్య నటన అదిరిపోయిందని.. సినిమా హిట్ అవడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా సినిమాకు మ్యూజిక్ అదిరిపోయిందని.. థమన్ మ్యూజిక్ తో బాలయ్య సినిమా బ్లాక్ బస్టర్ కానందుని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది సినిమాలో ఫైటింగ్ తప్ప ఏమీ లేదని.. అసలు సెకండ్ హాఫ్ అంత మనం ఏం ఊహిస్తామో అదే జరుగుతుందని.. సస్పెన్స్ అన్నదే లేదని.. నెగిటివ్ గానూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏదేమైనా మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా.. బాలయ్య కలెక్షన్ల రిత్య హిట్ కొట్టడం గ్యారెంటీ అని తెలుస్తుంది. మరి డాకు మహారాజ్ ఎంత మేర కలెక్షన్లు సాధిస్తాడో వేచి చూడాలి.