మెగా – అల్లు ఫ్యామిలీ మధ్యన కోల్డ్ వర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకరంటే.. ఒకరికి అసలు పడడం లేదంటూ.. ఇరు కుటుంబాల మధ్యన చాలా డిస్టెన్స్ వచ్చేసిందంటూ.. ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ రూమర్సే అని.. క్లారిఫై చేసేందుకు అటు అల్లు ఫ్యామిలి గాని, ఇటు మెగా ఫ్యామిలీ గాని ఎవరు ఆసక్తి చూపటం లేదు. ఈ క్రమంలోనే వీరి మధ్యన గొడవలు వాస్తవమే అని అంతా భావిస్తున్నారు. అయితే అల్లు కాంపౌండ్ కూడా మా మధ్యన వివాదాలు ఉన్నది వాస్తవం అనే విధంగా చెప్పే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అల్లు అర్జున్.. నంద్యాలకు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ఎన్నో సందర్భాల్లో ఇది జరుగుతూనే ఉంది. ఇక ఇప్పుడు మరోసారి అల్లు కాంపౌండ్ కన్ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై పడినట్లు తెలుస్తుంది.
రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్‌ను జనవరి 10న సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజు దసరా కానుక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మొదట్లో ఈ డేట్ కు విశ్వంభర రావాల్సి ఉండగా.. చిరంజీవిని దిల్ రాజు రిక్వెస్ట్ చేయడంతో.. ప్రొడ్యూసర్ని ఓప్పించి ఆయన సినిమాను వాయిదా వేయించారు చిరంజీవి. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్‌కు క్లాష్ ఇచ్చేందుకు అల్లు అరవింద్ సిద్ధమయ్యాడట. తాను ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన రూ.80 కోట్ల భారీ బడ్జెట్ మూవీ తండేల్‌ను సంక్రాంతి బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు కార్తికేయ 2 ఫేమ్.. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లోను మంచి హైప్ నెలకొంది. ఇక ఈ సినిమా నాగచైతన్య కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఇప్పటికి టాకీ పార్ట్ 80% పూర్తయిందని.. ఈ క్రమంలోనే నవంబర్ లోపు షూట్ మొత్తాన్ని పూర్తి చేసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించి.. సంక్రాంతి కానుకగా సినిమాను దింపాలనే ఆలోచనలో ఉన్నాడట అల్లు అరవింద్. ఇక ఈ క్రమంలో జనవరి 14న తండేల్ మూవీ రిలీజ్ అవుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన రాకపోయినా.. ఇప్పటికే సోషల్ మీడియాలో దీనిపై చర్చలు మొదలైపోయాయి.
భారీ బడ్జెట్ సినిమా కావడం.. అది కూడా నాగచైతన్య మార్కెట్‌ను మించి ఈ సినిమాకు ఖర్చు పెట్టడంతో.. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని అల్లు అరవింద్ భావించడంలో తప్పు లేదంటూ.. సంక్రాంతి కాకుండా వేరే డేట్ లో సినిమాలు రిలీజ్ చేసి పాజిటివ్ టాక్ రాకపోతే.. సినిమాకు కలెక్షన్ పరంగా భారీ ప్రభావం పడే అవకాశం ఉంటుంది.. ఈ కారణంగానే సేఫ్‌గా సంక్రాంతికి తండేల్ సినిమాను తీసుకురావడంలో తప్పు లేదంటూ.. పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం కావాలనే చరణ్ గేమ్ ఛేంజర్‌కు పోటీ ఇచ్చేందుకు ఇప్పుడు రంగంలోకి దింపారని.. కోపంతో ఊగిపోతున్నారు. నెగిటివ్ కామెంట్స్ తో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే.. ఏ రేంజ్ లో వివాదాలు మొదలవుతాయో చూడాలి.