టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా దేవరతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు కొరటాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తుంది. ఇక జాన్వి తెలుగులో నటిస్తున్న మొదటి మూవీ ఇదే కావడం విశేషం. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇదిలా ఉంటే కొరటాల టాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా ఆయన తెరకెక్కించిన ఆచార్య తప్ప.. మిగతావన్నీ మంచి సక్సెస్ అందుకున్నాయి. దీంతో దేవరపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే కొరటాల దేవర తర్వాత ఏ హీరోతో సినిమా తీయబోతున్నాడు.. బిగ్ స్టార్స్‌తో సినిమాలు తెరకెక్కిస్తాడా.. లేదా.. కొత్త ఆఫర్స్ వస్తున్నాయా.. ఇలాంటి ప్రశ్నలు ఫిలిం వర్గాల నుంచి.. అభిమానుల వరకు అందరిలోనూ మొదలయ్యాయి. ఇక ఎన్టీఆర్‌తో దేవర సినిమా తర్వాత.. కొరటాల ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నాడు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. కొరటాలను దర్శకుడుగా మార్చి ఫస్ట్ సినిమాతో సక్సెస్ అందించిన హీరో ప్రభాస్. ఈ క్రమంలో కొరటాల.. దేవర తర్వాత సినిమాను.. ప్రభాస్‌తో ప్లాన్ చేసాడట. ప్రభాస్ కోసం ఓ మంచి కథను రెడీ చేసుకున్నట్లు సినీవర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దేవర పార్ట్ 2 పూర్తికాగానే వీరి కాంబోలో సినిమా రాబోతుందట. ఇక గతంలో ప్రభాస్, కొరటాల కాంబోలో వచ్చిన మిర్చి సూపర్ సక్సెస్ అందుకుంది.
అలాగే మరోసారి ఈ కాంబినేషన్ వర్కౌట్ అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది అనడంలో సందేహం లేదు. ఇక ఈ కాంబినేషన్ ఎంతవరకు సెట్ అవుతుందో తెలియదు గానీ.. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా ఉండబోతుందట. ఈ నేపథ్యంలో దేవర హిట్ కోసం ప్రభాస్ ప్రార్థనలు చేస్తున్నాడని ఓ క్రేజి న్యూస్ నెటింట తెగ వైరల్ గా మారింది. ఈ క్రమంలో జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న దేవరపై ప్రేక్షకుల్లో ముందు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కాసితో కొరటాల.. కథ, స్క్రీన్ ప్లే, కాస్టింగ్ విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరి దేవర రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.