టాలీవుడ్ మాన్ అఫ్ మాసస్ జూనియర్ ఎన్టీఆర్ మొదటి నందమూరి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన తారక్.. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1తో మొట్టమొదటిసారి సక్సెస్ అందుకున్నాడు. చిన్న వయసులోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో.. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. సింహాద్రి, రాఖీ, యమదొంగ,అదుర్స్, బృందావనం ఇలా వరుస బ్లాక్ బాస్టర్ హిట్లర్ అందుకొని స్టార్ హీరోగా మారాడు. అయితే మధ్యలో శక్తి, ఊసరవెల్లి, దమ్ము, బాదుషా, రామయ్య వస్తావయ్య ఇలా వరుస ప్లాఫ్‌లు ఎదురైనా వెనుతిరగకుండా స్ట్రాంగ్ గా నిలబడి టెంపర్ సినిమాతో త్రో బ్యాక్ అయ్యారు.
చివరిగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్ని దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం తారక్.. కొరటాల శివ డైరెక్షన్లో దేవర పార్ట్ 1తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఇక ఈనెల 27న దేవర గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తారక్ క్యారెట్రైజేషన్ ట్రైలర్లో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయితే ఈ సినిమాకి తారక్ తీసుకున్న రెమ్యూనరేషన్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది. తారక్ దేవరకు రెమ్యూనరేషన్ భారీగా పెంచేశారని.. తన చివరి సినిమా ఆర్‌ఆర్ఆర్ కంటే 33% ఎక్కువగా రెమ్యూనరేషన్ దేవరకు తీసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్‌కు రూ.45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న తారక్.. ఇప్పుడు ఏకంగా దేవరకు రూ.60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. అంటే మొత్తంగా 33% రెమ్యునరేషన్ పెంచేసాడట. ఈ వార్తల్లో నిజమైనతుందో తెలియదు గానీ.. ప్రస్తుతం తారక్ రెమ్యునరేషన్ న్యూస్ తెగ వైరల్‌గా మారుతుంది. ఇక దేవరకు జంటగా నటిస్తున్న జాన్వికి రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ విలన్‌గా కనిపిస్తున్న సైఫ్ అలీ ఖాన్‌కు రూ.10 కోట్లు, ప్రకాష్ రాజ్‌కు రూ.1.5 కోట్లు, శ్రీకాంత్ కు రూ.50 లక్షలు, మురళీ శర్మకు రూ.40 లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న దేవర ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో ఎన్టీఆర్‌కు ఎలాంటి రిజల్ట్ వస్తుందో వేచి చూడాలి.