ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్‌గా సక్సెస్ సాధించిన జానీ మాస్టర్ ఇప్పుడు తమిళ, కన్నడ, హిందీలోను మంచి క్రేజ్‌తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన 70వ నేషనల్ అవార్డ్స్‌లో జానీ మాస్టర్ కు బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా అవార్డు కూడా దక్కింది. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళంలోనూ ఫుల్ డిమాండ్ ఉన్న కొరియోగ్రాఫర్ గా దూసుకుపోతున్న జానీ మాస్టర్ పై తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదురయ్యాయి. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతమైన తర్వాత సినీ ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు రేగుతున్న సంగతి తెలిసిందే. ఫిలం ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఎంతోమంది మహిళలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి తమ అనుభవాలను వివరిస్తున్నారు. తమకు ఎదురైన చేదు అనుభవాలను వేధింపులను ధైర్యంగా బయటకు వచ్చి చెప్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే పలువురు మలయాళ సెలబ్రెటీలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తెలుగులోనూ ఈ తిరుగుబాటు మొదలైంది. ఇక అసలు విషయానికి వెళ్తే జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ.. ఓ యువ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ.. ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. తనపై హత్యాచారం చేయడంతో పాటు గాయపరచాడంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులో ఆమె చెన్నై, ముంబై, హైదరాబాదులతో సహా వివిధ వివరాల్లో అవుట్‌డోర్ చేస్తున్న సమయంలో మరియు నర్సింగీలోను తన నివాసంలో కూడా జానీ తనపై ఎన్నోసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పుకొచ్చింది.
ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక ఈ యంగ్ కొరియోగ్రాఫర్ నర్సింగ్ నివాసి అయినందున నర్సింగ్ పోలీసులు కేసు బదిలీ చేయగా అతనిపై ఐసీసీ సెక్షన్ 376 (రేప్) క్రిమినల్ (బెదిరింపులు) 506 మరియు స్వచ్ఛందంగా గాయపరచడం (323) క్లోజ్ (2) మరియు (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే జానీ మాస్టర్ పై గతంలోనూ నేరచరిత్ర ఉంది. 2017లో ఒక కాలేజీ మహిళపై దాడి చేసిన కేసులో 2019లో మేడ్‌చెల్‌లో స్థానిక కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. ఇక టాలెంట్ పరంగా జానీ మాస్టర్ దూసుకుపోతున్నాడు. గతంలో 67వ నేషనల్ అవార్డులను బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా అవార్డును దక్కించుకున్నాడు. కన్నడ సినిమా యువరత్నాలోని ఓ సాంగ్ ఈయనకు అవార్డు దక్కింది. తెలుగు డ్యాన్స్ మాస్టర్ ఏకంగా రెండుసార్లు వేరే భాషల్లో సినిమాలకు నేషనల్ అవార్డులు దక్కించుకోవడం విశేషం.