నందమూరి నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి ఇటీవల 50 ఏళ్లు పూర్తయిన క్రమంలో స్వర్ణోత్సవ వేడుకలను గ్రాండ్ లెవెల్ లో చలనచిత్ర పరిశ్రమ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకు దక్కని గౌరవం బాలయ్యకు దక్కింది. ఓ రకంగా బాలయ్య రికార్డ్ క్రియేట్ చేశారనే చెప్పాలి. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలలో ప్రయాణం కంటిన్యూ చేయడం వల్లే బాలయ్యకు ఇది సాధ్యమైంది. చిరు, నాగార్జున, వెంకటేష్ ఇలా బాలయ్య జనరేషన్ హీరోలు ఎంతమంది ఉన్నా.. ఈ రికార్డును టచ్ చేయలేకపోయారు. దానికి కారణం కేవలం బాలయ్య మాత్రమే బాల నటుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడం.
ఇక తాజాగా బాలీవుడ్ నటి కరీనాకపూర్ కు కూడా ఇలాంటి అరుదైన గౌరవం దక్కింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కరీనా ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన క్రమంలో.. ఆమె పేరిట పరిశ్రమ సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహిస్తోంది. గతంలో ఈ ఘనత దిలీప్ కుమార్, అమితాబచ్చన్ లాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలకు దక్కింది. తర్వాత అలాంటి ఘనత కెవలం కరీనా కే సొంతమైంది. ఇది నిజంగా ఒక రకంగా రికార్డు అనే చెప్పాలి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఆమె నటించిన సినిమాలను ప్రదర్శించనున్నారు. రివ్యూస్, కభీ ఖుషి కభీ ఘమ్, త్రి ఇడియట్స్, చమేలీ లాంటి సినిమాలను ప్లే చేయనున్నారు.
ఇక ఆమె జీవితంలో గొప్పగా మిగిలిపోయిన మరిన్ని సినిమాలు స్పెషల్ స్క్రీనింగ్ కానున్నాయి. అలా కరీనాకపూర్ పేరిట ఇది నిజంగానే ఓ రికార్డు అని చెప్పడంలో సందేహం లేదు. ఈ జనరేషన్ హీరోయిన్లు ఎవరికి దక్కని ఘనత కేవలం కరీనాకే దక్కింది. ఇటీవల కరిన ప్రొడక్షన్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. బకింగ్ హమ్ మర్డర్స్ సినిమాకు ప్రొడ్యూసర్ గా ఏక్తా కపూర్ తో కలిసి వ్యవహరించింది. ఇకపై కరీనా ఇతర భాగస్వాములతో కలిసి మరిన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసే దిశగా అడుగులు వేయనుంది.