టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. కొత్తవారిని ఎంకరేజ్ చేస్తూ వైవిధ్యమైన కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న ఈ హీరో.. దసరా సినిమాతో మొదటిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి తన సత్తా చాటుకున్నాడు. ఇక తాజాగా నాని నుంచి మరో మూవీ సరిపోద్దా శనివారం కూడా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ.. తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇప్పుడు సరిపోయింది.. మీరంతా ఈ సినిమాని ఆదరించి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిపారు అంటూ వివరించింది. బాక్సాఫీస్ శివతాండవం అనే పేరుతో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే ఓటిటి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దసరా, హాయ్ నాన్న ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సూపర్ ఫామ్‌లో ఉన్న నాని.. లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం.. వివేకా ఆత్రేయ డైరెక్షన్‌లో తెరకెక్కింది. గతంలో వీరి కాంబోలో అంటే సుందరానికి సినిమా రిలీజ్ అయింది.
అయితే ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా ఇప్పుడు వచ్చిన సరిపోదా శనివారం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈసారి రూట్ మార్చి మాస్ ఆడియన్స్ కోసం తెరకెక్కించిన ఈ సినిమా.. పోస్టర్, టీజర్‌తో ప్రేక్షకులో ఆసక్తి నెలకొంది. ఇక ఈ క్రమంలో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను ఆదరించడానికి నాని సిద్ధమయ్యాడు. సరిపోదా శనివారం నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సౌత్ ఇండియాలోని అన్ని లాంగ్వేజ్‌లలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.