మొదట మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఆ డైరెక్టర్ తో అనుకున్నారా.. స్టోరీ కూడా వేరా.. బాలయ్య ప్లాన్ ఏంటంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనన్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞను హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నారు. దీనికి బాలయ్య చిన్న కూతురు తేజస్విని ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. హీరోగా సినిమా ప్రకటన సందర్భంగా తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో స్లిమ్‌ లుక్ తో మోక్షజ్ఞ ఆకట్టుకున్నాడు. గతంలో చాలా లావుగా, చబిగా కనిపించిన మోక్షజ్ఞ ఒక్కసారిగా స్లిమ్ అండ్‌ యంగ్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఇక హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి బరువు తగ్గే క్రమంలో తన డేడికేషన్ కు ఫిదా అయ్యారు నందమూరి ఫ్యాన్స్. నిన్న మొన్నటి వరకు మోక్షజ్ఞ లుక్ తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

Balakrishna Appreciate Prashanth Varma After Watching Hanuman Movie | Teja  Sajja | Super Macha - YouTube

ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ మైథాలజికల్ సోషియా ఫాంటసీ డ్రామాలో నటించనున్నారు. హనుమాన్ తరహాలోనే ఈ సినిమా ఉంటుందని టాక్. ప్రస్తుత సంఘటనలకు మైథాలజికల్ టచ్ చేస్తే సినిమా చేయనున్నారని ఇదే సినిమాకు హైలెట్ అంటూ సమాచారం. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. ఇక మోక్షజ్ఞ గత రెండేళ్లుగా తన వర్కౌట్ విషయంలో దృష్టిసారించి.. బరువు తగ్గడం, యాక్టింగ్ క్లాసెస్ కి వెళ్లడం ఇలా అన్ని విషయాలను ఫుల్ ట్రైన్ అయ్యారు. ఫస్ట్ లుక్ లో క్యూట్ గా హ్యాండ్సమ్ గా ఉన్న మోక్షజ్ఞ వెండితెరపై ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో వేచి చూడాలి. ఇదిలా ఉంటే తన కొడుకు మోక్షజ్ఞని మొదట బాలయ్య వేరే డైరెక్టర్ తో పరిచయం చేయించాలని ప్లాన్ చేశాడట. అసలు ప్రశాంత్ వ‌ర్మ‌ తన మైండ్‌లోనే లేడని తెలుస్తుంది.

సంగీతం శ్రీనివాస్ చేతుల మీదుగా తన కొడుకుని బాలయ్య పరిచయం చేయాలనుకున్నాడట. సంగీతం – బాలయ్య కాంబోలో తెర‌కెక్కి బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన ఆదిత్య 369 సీక్వెల్‌గా సినిమా చేయాలనుకున్నారని.. ఆదిత్య 999 పేరుతో ఈ సినిమా తెర‌కెక్కించాలని బాలయ్య భావించినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని బాలయ్య కూడా పలు సందర్భాల్లో వివరించాడు. ఇక దానికి తగ్గట్టు స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడట. ఓ టైంలో తనే డైరెక్టర్గా కూడా వ్యవహరించాలని భావించాడట. ఆదిత్య 999 పౌరాణిక మూవీగా రూపొందించాలని తాను మెయిన్ హీరోగా.. కొడుకు పాత్రలో మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నారట. ఇటీవల ఇంటర్వ్యూలో బాలయ్య ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు.

Nandamuri Mokshagna Teja: అఫీషియ‌ల్ - బాల‌కృష్ణ ఫేవ‌రేట్ జోన‌ర్‌లో మోక్ష‌జ్ఞ  డెబ్యూ మూవీ - డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?-nandamuri mokshagna teja prasanth varma  movie officially announced balakrishna ...

అయితే ప్రస్తుతం దాని గురించి ఆలోచిస్తున్నానని.. ఎలా చేయాలనేది ప్లాన్ చేస్తానని.. చెప్పిన బాలయ్య ఈ లోపే లెక్కలన్నీ మార్చేశారు. సడన్గా ట్రాక్‌లోకి ప్రశాంత్ వార్మను దింపారు. ప్రశాంత్ వర్మ చేతుల మీద మోక్షజ్ఞ డబ్ల్యూ మూవీ రానుంది. అన్‌ స్టాపబుల్ విత్ ఎన్బికె టాక్ షోకు ప్ర‌శాంత్ వర్మ దర్శకుడుగా వ్యవహరించాడు. అప్పుడే ప్రశాంత్ వర్మ వర్క్, డెడికేష‌న్‌ స్వయంగా చూసిన బాలయ్య.. ప్ర‌శాంత్ డిజైన్ చేసిన కాన్సెప్ట్లతో ఫిదా అయ్యారని తెలుస్తుంది. ఇక ఆ షోకు తేజస్విని కూడా పనిచేసింది. దీంతో ప్రశాంత్ వ‌ర్మ‌ ఏంటో ఆమె కూడా అబ్జర్వ్ చేశారని.. ఈ ఇద్దరి అభిప్రాయంతో ప్రశాంత్ వర్మనే మోక్షజ్ఞను పరిచయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.