టాలీవుడ్ హీరో, హీరోయిన్స్ సిద్ధార్థ – అదితి రావ్ హైదారి జంటకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఎప్పటినుంచో ప్రేమలో ఉన్న ఈ జంట.. ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి వివాహం రహస్యంగా జరిగిందని.. నెట్టింట వార్తలు తెగ వైరల్ గా మారాయి. దీంతో తమ పెళ్లి కాలేదని.. కేవలం ఎంగేజ్మెంట్ అది కూడా రహస్యంగా కాదు.. ప్రైవేట్ గా చేసుకున్నామంటూ సిద్ధార్థ వివరించాడు. ఇటీవల అదితి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. ఆ ఇంటర్వ్యూలో సిద్ధార్థకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది.
తనకు తన నానమ్మ అంటే ఇష్టమని.. ఆమె ప్రారంభించిన స్కూల్లోనే సిద్ధార్థ తనకు ప్రపోజ్ చేశాడని.. తన మోకాళ్ళపై కూర్చుని పెళ్లి ప్రపోజ్ చేసి తన నాన్నమ ఆశీస్సుల కోసమే అక్కడ ప్రపోజ్ చేసినట్లు వివరించాడని చెప్పుకొచ్చింది. ఇక తమ పెళ్లి కచ్చితంగా వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలోనే ఉంటుందని.. ఆలయం మాకు చాలా ప్రత్యేకమైనది.. అందుకే నిశ్చితార్థం కూడా అక్కడే చేసుకున్నామంటూ చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఈ జంట అభిమానులకు మరోసారి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. సౌత్ ఇండియన్ సాంప్రదాయ పద్ధతిలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.
ఇరు కుటుంబాల సభ్యులు, అతికొద్దీ మంది సన్నిహితులు సమక్షంలో ఈ జంట ఏడడుగులు వేశారు. తమ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వివాహబంధాని అఫీషియల్ గా ప్రకటించారు. నా సూర్యుడు నువ్వే.. నా చంద్రుడు నువ్వే.. నా నక్షత్రాలన్నీ నువ్వే అంటూ అందమైన క్యాప్షన్ తో సిద్ధార్థ పై అదితి తన ప్రేమను వివరించింది. ప్రస్తుతం సిద్ధార్థ్ అదితి పెళ్లి ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో కొత్త జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక గతంలో వీరు ప్రైవేట్ ఎంగేజ్మెంట్ జరుపుకున్న వనపర్తి జిల్లా శ్రీరంగాపురం లోని రంగనాథ స్వామి ఆలయంలోనే.. అదితి ముందు చెప్పినట్లుగా సింపుల్గా సిద్ధార్థ్‌ని వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది.