ఈ ఏడాది రిలీజై బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన సౌత్ సినిమాల్లో ది గోట్ సినిమా కూడా ఒకటి. దిగోట్ సినిమా కోసం విజయ్ దళపతి ఎంతో కష్టపడినా స్టోరిపట్టు లేకపోవడంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే సినిమాల్లో విజయ్ ఉపయోగించిన కారు నెంబర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది. ఈ సినిమాలో విజయ్ కార్ నెంబర్ను ఎంతో లాజికల్ గా డిజైన్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మేకర్స్. ఆ కారు నెంబర్ సీఎం 2026 అని రాసి ఉండడం విశేషం. ఇప్పటికే విజయ్ దళపతి తన సొంత పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో విజయ పార్టీ పోటీ చేయనుంది.
ఈ క్రమంలో విజయ పార్టీకి కచ్చితంగా సక్సెస్ లభిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారీ మెజారిటీతో విజయ్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ఇంకా ఏం మొదలుకాకముందే తన సీఎం అవుతానని కార్ నెంబర్ ద్వారా కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్న విజయ్.. నిజంగా సీఎంగా సక్సెస్ అందుకుంటాడో.. లేదో.. వేచి చూడాలి. ఇక నటుడిగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న విజయ్.. సీఎంగా సక్సెస్ అవడం అనేది సాధారణ విషయం కాదు. సీనియర్ ఎన్టీఆర్ మినహా మరి ఏ సినిమా నటులు రాజకీయాల్లో అంత సులువుగా సక్సెస్ అందుకోలేకపోయారు.
విజయ్ రేంజ్ క్రేజ్ అంతకంతకు పెరుగుతున్న క్రమంలో.. ఇక ఫ్యాన్స్ కోసం హెచ్ వినోద్ డైరెక్షన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్. ఇది అతడి చివరి సినిమా అని టాక్ విజయ సినిమాలపై పెద్దగా దృష్టిపెట్టే అవకాశాలు లేవు. అయితే ఇక చివరి సినిమాగా తెరకెక్కుతున్న విజయ్ 69 కోసం ఏకంగా రూ.275 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా విజయ్ రేంజ్.. ఫ్యాన్ బేస్ ఊహించని స్థాయిలో పెరిగిపోతున్న క్రమంలో.. తమిళ్ రాష్ట్రంలో ప్రస్తుతం విజయ్‌కు విపరీతమైన మద్దతు లభిస్తుంది. విజయ్ రాబోయే రోజుల్లో కెరీర్‌ను ఏ విధంగా మలుచుకుంటారు.. సీఎం గా సక్సెస్ అందుకుంటారో లేదో.. అనే చర్చ కూడా నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే రోజురోజుకు విజయ్‌ని అభిమానించే ఫ్యాన్స్ మరింతగా పెరుగుతున్నారు.