చిరంజీవిని సహాయం అడిగిన సీనియర్ హీరోయిన్.. నో చెప్పడంతో నెగిటివ్ ప్రచారం ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ మెగాస్టార్‌గా మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సీనియర్ స్టార్ చిరంజీవి. తన సినీ కెరీర్‌లో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ తో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన ఎక్కువగా తన సినిమాల్లో కలిసి నటించిన హీరోయిన్లలో రాధా, రాధిక, విజయశాంతి, సుహాసిని పేర్లు వినిపిస్తూ ఉంటాయి. వీళ్లంతా చిరంజీవితో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. కాగా బిగినింగ్ లో చిరంజీవి, సుహాసిని టామ్ అండ్ జెర్రీలా ఉండే వారట‌. ఈ విషయాన్ని సుహాసిని స్వయంగా వివరించింది. తన రెండో సినిమా మంచి పల్లకిలో చిరంజీవితో కలిసిన నటించింది సుహాసిని. ఈ సినిమా షూట్‌ టైంలో నేను చిరంజీవిని చూసా.. అప్పటికి నేను ఇంకా హీరోయిన్ కాలేదు. అయితే అప్పట్లో చిరంజీవి చాలా సైలెంట్ గా ఉండేవారు. అలాంటి క్రమంలో ఆయన నన్ను చూసి అమ్మాయికి పొగరెక్కువ అని అనుకునేవారట. మంచు పల్లకి మూవీలో నన్ను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు.

Chiranjeevi - Suhasini | తెలుగు360

ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారు ఏంట్రా బాబు అని చిరంజీవి భావించారట. ఇక ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్నామని.. నెలరోజుల పాటు హైదరాబాదులో షూట్ ఉండడంతో.. జర్నీ స్టార్ట్ చేసామని అయితే ఫ్లైట్లో చిరంజీవి మాట్లాడిన మాటలు జీవితంలో మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చింది సుహాసిని. మీకు ఏ హోటల్ బుక్ చేశారని ఆయన అడిగారని.. హోటల్ పేరు చెప్పాను. మీరు హైదరాబాదులో ఎన్ని రోజులు ఉండాలి అని ప్రశ్నించగా దాదాపు నెలరోజులు అని చెప్పానని వివరించింది. నాకు హైదరాబాద్ కొత్త ఏదైనా సాయం కావాలంటే అడుగుతా అన్నట్లుగా నేను చిరంజీవితో చెప్పానని.. ఆయన వెంటనే నన్ను ఎలాంటి సాయం అడగొద్దు. నేను ఏమీ చేయనని చెప్పడం మొదలెటేశారని.. ఆయన బిహేవియర్ కి ఆశ్చర్యపోయ్యా అంటూ సుహాసిని చెప్పుకొచ్చింది. ఏంటి ఇతని క్యారెక్టర్ ఇదా అనుకున్నానని.. కానీ ఆయన నన్ను ఆట పట్టించడానికి అలా అన్నారంటూ చెప్పుకొచ్చింది.

Suhasini : హిందీ భాష పై సుహాసిని.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్..!

అదే టైంలో సుమలత నన్ను కలిసి.. నీకు చిరంజీవితో ఛాన్స్ వచ్చిందట కదా అని అడిగింది. అవును సో వాట్.. అని నేను అన్న. అదేంటే అలా అంటావు తెలుగులో ఆయన త్వరలో సూపర్ స్టార్ అని అంతా అంటున్నారని సుమలత చెప్పింది. అవునా ఆయన ముఖం ఏంటి విల‌న్‌లా ఉంది అని వెటకారంగా అన్నానంటూ వివరించింది. అయితే వెంటనే సుమలత వెళ్లి చిరంజీవికి చెప్పేసిందని.. చిరంజీవి షూటింగ్ కి రాగానే విలన్‌తో యాక్ట్‌ చేసేది ఎవరు అంటూ వెటకారంగా మాట్లాడారని.. ఈయనకి ఎలా తెలిసిపోయింది అనుకున్నా.. సుమలతని అడిగితే అవును నేనే చెప్పా అంది అంటూ సుహాసిని వివరించింది. చిరంజీవి గారు నాపై సెటర్లు వేస్తూనే ఉన్నారు. నువ్వు హీరోయిన్, నేను విలన్ కదా.. అని ఆట‌పట్టిస్తూనే ఉన్నారు అంటూ చెప్పుకొచ్చింది తర్వాత మేము నెమ్మదిగా మంచి ఫ్రెండ్స్ అయిపోయామని సుహాసిని వివరించింది. ప్రస్తుతం సుహాసిని చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారాయి.