టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియని డైరెక్టర్గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు పాన్ ఇండియా సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేసిన జక్కన్న.. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లెవెల్‌లో సినిమా తెరకెక్కించి ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చాటనున్నాడు. ఇందులో భాగంగానే మహేష్ బాబు కూడా సినిమా కోసం చాలా స్ట్రిక్ట్ డైట్‌తో పాటు.. మేకవర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా సెట్స్ పైకి కూడా రాకముందే ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్ పైకి వస్తుందా.. ఎప్పుడెప్పుడు సినిమాను చూస్తామంటూ అభిమానులు అంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు సినిమా పై ఎన్నో రూమర్లు నెటింట తెగ వైరల్‌గా మారాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ తెగ చక్కర్లు కొడుతుంది. డిసెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారని.. మొదటి షెడ్యూల్ షూటింగ్ జర్మనీలో మొదలవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ కి సంబంధించి త్వరలోనే యూనిట్ సభ్యులు వర్క్ షాప్ నిర్వహించనున్నారట. కాగా ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ తరహాలో ఉండనిందని టాక్ నడుస్తుంది.
2027 జనవరిలో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట టీం. ఇక ఈ సినిమాల్లో ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ జెల్సియా ఇస్లాం హీరోయిన్ పాత్రలో కనిపించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో వేచి చూడాలి. కాగా ఇటీవల విజయేంద్రప్రసాద్ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో వివరిస్తూ.. నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవల రచయిత విలబర్ స్మిత్‌కు పెద్ద ఫ్యాన్స్. ఎప్పటికప్పుడు ఆయన పుస్తకాలను చదువుతూనే ఉంటాం. ఇక ఆ పుస్తకాల ఆధారంగానే నేను ఈ సినిమా స్క్రిప్ట్ రాశా అంటూ వివరించారు. కాబట్టి రాజమౌళి, మహేష్ సినిమా ఒక అడ్వెంచర్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకి రానుందని క్లారిటి వచ్చింది.