టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తెలుగు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకొని.. హీరోయిన్‌గా సక్సెస్ అందుకున్న చిరంజీవి.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు ఆయన ప్లేస్ ను మరొక హీరో రీప్లేస్ చేయలేకపోయారంటే.. ఆయన నటన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక గతంలో చిరంజీవితో సినిమా చేయడానికి ప్రతి దర్శకుడు తెగ పోటీ పడుతూ ఉండేవారు. అలాంటి క్రమంలో చిరంజీవి ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలని భావించాడట. ఆదర్శకుడు కూడా చిరంజీవికి కథ చెప్పారని.. కథ నచ్చడంతో చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ తెలుస్తుంది.
తర్వాత మరో హీరో వచ్చి అదే కదా నాకైతే బాగుంటుంది.. మనం ఈ కథను చేద్దామని ఆ డైరెక్టర్‌తో చెప్పడంతో.. చిరంజీవిని పక్కన పెట్టి.. ఆ డైరెక్టర్ మరో స్టార్ హీరోతో ఆ సినిమాను తెరకెక్కించారు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు.. చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కథను తీసుకున్న మరో హీరో ఎవరు.. అసలు ఆ కథ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావుకు ఈ జనరేషన్ ఆడియన్స్ లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిజానికి రాఘవేందర్రావు చిరంజీవితో ఎన్నో సినిమాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నాడు. అయితే ఈ క్రమంలో చిరంజీవి తన ఇమేజ్ను పక్కనపెట్టి ఒక రొమాంటిక్ సినిమా చేయాలని భావించారు. అందులో భాగంగా అల్లరి ప్రియుడు సినిమా కాదని చేయడానికి రెడీ అయ్యారు. చిరంజీవికి కూడా మాస్ సినిమాలు బోర్ కొట్టడంతో.. చేంజ్‌ఓవర్‌లా ఉంటుందని రాఘవేంద్ర చెప్పిన ఈ రొమాంటిక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
కానీ.. ఆ తర్వాత రాఘవేంద్రరావు దగ్గర కథను విన్న రాజశేఖర్.. ఎలాగైనా ఆ సినిమాను తాను చేస్తానని చిరంజీవికి కూడా ఒక మాట చెప్పి.. ఆ కథను తీసుకొని తానే హీరోగా నటించాడు. అయితే తనకు నచ్చిన కథను పెద్దమనసు చేసుకుని రాజశేఖర్ కోసం ఇచ్చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇక రాజశేఖర్ సినీ కెరీర్ లోనే ఇది సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఈ సినిమాను చిరంజీవి చేసి ఉంటే ఎలాంటి రిజల్ట్ వచ్చేది అనేది పక్కన పెడితే.. ఈ సినిమాతో చిరంజీవికి సరికొత్త ఇమేజ్ అయితే క్రియేట్ అయ్యేది. ఎంటైర్ చిరంజీవి కెరీర్‌లో అలాంటి సినిమా ఇప్పటివరకు ఒక్కటి కూడా రాలేదు. ఈ క్రమంలో అలాంటి సినిమాల్లో ఆయన నటించి ఉంటే ఆలోటు కూడా తీరిపోయి ఉండేది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.