15 సెకండ్ల సీన్ కోసం రోజంతా షూట్.. 35 రోజులు నీళ్లలోనే.. దేవర కోసం తారక్ కష్టం.. !

సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. దేవర రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో సినిమాపై అంచనాలను కూడా రెట్టింపు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ క్రమంలో దేవర టీం ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల ప్రమోషన్స్ లో తెగ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో దేవర టీం డైరెక్టర్ సందీప్ రెడ్డి తో కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇంటర్వ్యూలో మూవీ టీం మాట్లాడుతూ సినిమాపై ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఇక సినిమా 48 నిమిషాలు యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ లో ఉంటాయంటూ తారక్ చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మాట్లాడుతూ అండర్వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం స్టూడియోలో పెద్ద వాటర్ ఫుల్ తయారు చేసామని.. 200 వరకు మ్యాన్ మ్యాడ్ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చాడు. 30 రోజులు నీటిలోనే షూట్ చేశామని వివరించిన తారక్.. దేవర సినిమా మొత్తం లో అదే ఇంపార్టెన్స్ సీక్వెన్స్ అంటూ చెప్పుకొచ్చారు. వాటర్ లో ఎలిమెంట్స్ చాలా వాడామని.. ఆ యాక్షన్ సీక్వెన్స్ కోసం మోటార్ బాల్స్, అలలు రావడానికి మిషన్స్ అలా నిజమైన సముద్రంలో జరిగే ఫైట్ల కనిపించడానికి ఎంతో ఖర్చు చేసామంటు చెప్పుకొచ్చారు.

యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డాను అని.. షార్క్ తో సీన్ అదిరిపోతాయంటూ వివరించాడు. ఒక్క 15 సెకండ్ల సీన్ కోసం రోజంతా షూట్ చేశామని.. నీళ్ల లోపల షూటింగ్ ఒక్కోసారి సరిగ్గా కనపడేది కాదంటూ.. మూవీలో వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్ గురించి వివరించాడు. తారక్ చేసిన కామెంట్స్ మరోసారి దేవరపై హైప్‌ను రెట్టింపు చేశాయి. ఈ సినిమాలో భారీ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోతాయని సమాచారం. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ వివరించాడు ఈ సినిమాకు ఎన్టీఆర్ సినిమా కోసం ఎంంత కష్టపడ్డాడో అయ‌న మాట‌ల్లోనే అర్థం అవుతుంది. ఇక సినిమాలో తారక్‌కు జంటగా జాన్వి కపూర్, విలన్‌ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలి ఖాన్ నటించారు.