కన్నడ సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్గా తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు ప్రశాంత్ నీల్. కేజిఎఫ్ సిరీస్‌లతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్లు అందుకున్న ఈ డైరెక్టర్.. ప్రస్తుతం ఎన్టీఆర్‌ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా భారీ సక్సెస్ అందుకోవాలని అరట పడుతున్నారు. ఇక ఇటీవల ఎన్టీఆర్ దేవర సినిమా షూట్ పూర్తి చేసి ప్రమోషన్స్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా హడావిడి పూర్తయిన వెంటనే తారక్ తో.. ప్రశాంత్ సినిమా ప్రారంభించి తొందరగా ఆ సినిమాలు కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. దానికి తగ్గట్టుగా సినిమా భారీ సక్సెస్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి. ఇక తాజా వార్తల ప్రకారం ఈ సినిమా కూడా ఓ డార్క్ మోడ్ లో ఉండనుందట.
ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే డార్క్ మోడ్లో యాక్షన్ ఎంటర్టైనర్ అన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో కూడా భారీ ఎలివేషన్స్ ఎమోషన్స్ ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ప్రశాంత్ సినిమాల కంటెంట్ డైరెక్షన్ చూసిన తారక్ అతనిపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ హీరో, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అంటే ఆ సినిమా ఎలా ఉంటుందో అనే అంచనాలు ప్రేక్షకుల్లో విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు దానికి తగ్గట్టుగా సినిమాను చేసి సూపర్ సక్సెస్ సాధిస్తాడా.. ప్రశాంత్ నీల్ తన సినిమాతో ఎన్టీఆర్కు మరో బ్లాక్ పాస్టర్ సక్సెస్ ఇస్తాడా లేదా వేచి చూడాలి.