అరుదైన ఘనత సాధించిన సమంత.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపిన సమంతకు ఇటీవల ఓ అరుదైనా ఘనత దక్కింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ వేడుకల్లో.. అవార్డ్స్ కార్యక్రమం ఈనెల 27న దుబాయ్‌లో గ్రాండ్గా జరగనుంది. ఈ కార్యక్రమంలో సమంతను ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా సన్మానించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఈ తరానికి చెందిన ఉత్తమ నటుల్లో సమంత ఒకరని.. తన వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను నిరంతరం మెప్పిస్తుంది. అందుకే ఈ అవార్డును అందజేయడం ఆనందంగా ఉంది అంటూ నిర్వాహకులు వెల్లడించారు. ఇక స‌మాంత సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న ఆనందాని తెలియ‌జేస్తూ నాకు ఫైమా అవార్డ్‌ ఎల్లప్పుడూ ప్రత్యేకమే. దక్షిణాది సినిమాను ప్రపంచ ప్రేక్షకులు తెలియచెప్పే ఈ వేదికపై పాల్గొనడానికి నేను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ఒకప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్ లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సమంత.. గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు సమంత బయట ఈవెంట్లలో సందడి చేసి కూడా చాలా కాలం అయిపోయింది. ఈ క్రమంలో సమంత ఐఫా ఉత్సవాల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. తమ అభిమాన హీరోయిన్ ను అరుదైన ఘనత దక్కించుకోవడం.. త్వరలోనే ఓ స్టేజ్ పై కనిపిస్తుంది అన్న ఆనందంతో ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు.