‘ దేవర ‘ మెయిన్ స్టోరీ లీక్ చేసిన తారక్, సైఫ్.. అసలు సీక్రెట్ రివీల్ చేసేసారే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కేక్కనున్న దేవర సినిమా స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి ప్రతి ఒక్క ప్రేక్షకుడిలోను నెలకొంది. ఇప్పటికీ రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ చూస్తే కథ గురించి కాస్త క్లారిటీ వచ్చినా.. పూర్తి వివరాలు మాత్రం తెలియలేదు. తండ్రి కొడుకుల క్యారెక్టర్ లో మాత్రమే ఎన్టీఆర్‌ను ఆ ట్రైలర్ ద్వారా చూపించారు. అయితే తాజాగా అర్జున్ రెడ్డి,యానిమల్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో జరిగిన ఇంటర్నేషనల్ ఈవెంట్లో తారక్ అసలు కథను లీక్ చేసేసాడు. అలాగే విలన్ రోల్ చేసిన సైఫ్ అలీ ఖాన్ కూడా ఇంట్ర‌స్టింగ్ విష‌యాని రివీల్ చేశాడు. నాలుగు గ్రామాల గ్రామదేవతలు.. పూర్వికులు ఆయుధాల కోసం పోరాటం అంటూ సాగే ఓ లాంగ్ డైలాగు ఉంటుంది. మనిషికి బ్రతికే ధైర్యం చాలు.. చంపేంత ధైర్యం అవసరం లేదు అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కు ఓ రెంజ్‌ల‌లో హైలెట్ అయ్యింది.

కాదు కూడదని ఎవరైనా చంపితే.. ధైర్యాన్ని కూడగడితే ధైర్యాన్ని చంపే భయం అవుతా అంటూ తారక్ ఇచ్చిన వార్ంగ్‌.. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సముద్రంలోకి ఎక్కితే ఆ రోజు నుంచి కానరాన్ని భయాన్ని అవుతా అంటూ ఆయన చెప్పే డైలాగ్.. ఎవరికి అసలు ఆ డైలాగు ఏ సందర్భంలో చెప్పారు ఒకసారి తెలుసుకుందాం. సందీప్ రెడ్డికి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో దేవర నాలుగు గ్రామాల మధ్య జరిగే కదా అంటూ వివరించారు గ్రామాల ప్రజలు గ్రామదేవతలకు పూజలు చేస్తూ ఉంటారని పూర్వికులు ఆయుధాల కోసం పోరు జరుగుతుంది అంటూ బైరా తారక్ చెప్పొచ్చాడు. ఇక మనం ట్రైలర్, టీజర్ చూస్తే కత్తుల ఊరేగింపుగా తీసుకువెళ్లే దృశ్యాలు కనిపిస్తాయి. ఇక ఈ నాలుగు గ్రామాలకు ఏ పేరు ఉండదని సముద్ర తీరంలో ఓ కొండ ప్రాంతంలో ఈ నాలుగు గ్రామాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు.

పూర్వికులు ఆయుధాలను గ్రామస్తులు పూజలు చేస్తూ ఆయుధాల కోసం ఎలాంటి పనికైనా సిద్ధమవుతారు. ఎంత దూరమైన వెళ్తారంటూ చెప్పుకొచ్చాడు. మరి ఆయుధాలు ఏంటి అనేది సినిమాలో చూడాలి. దేవర టైటిల్ డిజైన్ చూస్తే కత్తులు కనిపిస్తాయి. కథను రిలేట్ చేసేలా కొరటాల ఆ టైటిల్ డిజైన్ చేశేరేమో. ఇక ఈ నాలుగు గ్రామాల్లో ఓ గ్రామానికి బైరా పాత్ర చేసిన సైఫ్ అలీఖాన్ అధినేతగా ఉంటాడు. మరో గ్రామానికి దేవర పాత్ర చేసిన ఎన్టీఆర్. ఫిక్షనల్ ప్రపంచంలో ఈ సినిమా కథ జరుగుతుందని ఎన్టీఆర్ వెల్లడించాడు. సముద్రతీరంలోని ఓ నాలుగు గ్రామాల మధ్య సినిమా ఉండనుందని చెప్పుకొచ్చాడు. ఇక సైఫ్ అలీఖాన్ మాట్లాడుతూ.. 1980, 90ల కాలంలో జరిగిన కథ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పాటించే ఆచారాలను ఈ సినిమాలో చూపించామంటూ డైరెక్టర్ కొరిటాల శివ వెల్లడించాడు. అయితే 80, 90లో జరిగే కథ అయినా పూర్తి రిమోట్ ఏరియాలోని జరిగిందట.