అన్నగారు అంటే నటుడు కాంతారావుకు అంత గౌరవమా.. ఎందుకంత గొప్ప అంటే..?

టాలీవుడ్ సీనియర్ హీరో తెలుగుజాతి గర్వించ దగ్గ నటుడు నందమూరి తారక రామారావుకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణచ‌ అభిమానం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్నగారు చనిపోయి ఇంతకాలమైనా.. ఎంతోమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటికీ చాలామంది పూజ గదిలో కృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్ ఫోటో కూడా ఉంటుంది. ఆ రేంజ్ లో అభిమానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్.. కేవలం సాధారణ ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకులు ఇలా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.

75sR0b4eTPI1VLoHOeuRO5pPCDj.jpg

చిత్ర పరిశ్రమంలోనూ తాను ఎదుగుతూ మరెందరికి అవకాశాలు కల్పించి ఆదుకున్న గొప్ప వ్యక్తి అన్నగారు. అలా ఆయన ఆశీస్సులతో తన కెరీర్ ను చక్కగా మలుచుకున్న పాత తరం హీరోలలో నటుడు కాంతారావు కూడా ఒకరు. మొదటి సినిమా ప్రతిజ్ఞ తర్వాత ఆయన సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో.. ఆయన్ను పిలిచి మరి సొంత సినిమా జై సింహా లో తనతో సమానమైన పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేశారు సీనియర్ ఎన్టీఆర్.

ఎన్టీ రామారావును దత్తత తీసుకున్నారని మీకు తెలుసా..? - Telugu Lives

అలాగే లవకుశ సినిమాలోను లక్ష్మణుడి పాత్ర కోసం కాంతారావును.. ఎన్టీఆర్ గట్టిగా రికవెంట్ చేశారట. అలా ఎన్నోసార్లు తనని అవకాశాలు లేక ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే సమయంలో ఆదుకున్న ఎన్టీఆర్ అంటే కాంతారావుకు కూడా అంతే గౌరవం, అభిమానం. అలాంటి కాంతారావు సొంత సినిమా పూజ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ హాజ‌రై సంద‌డి చేసిన సంద‌ర్భాలు ఉన్నాచి. అలా కాంతారావు సొంత సినిమా పూజ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ పాల్గొన్న సమయంలో క్లిక్ మ‌నిపి్చిన ఫోటోనే ఇది. ఇందులో హీరోయిన్ జయంతి కూడా కనిపిస్తున్నారు.