పవన్ హీరోయిన్ ను ఆ స్టార్ హీరోస్ అందుకే పక్కన పెట్టారా.. టాప్ సీక్రెట్ రివిల్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించాలంటే అందం, అభినయంతో పాటు లక్ కూడా కలిసి రావాలి. అలా ఒకసారి ఎంతో అందం మా అభినయం ఉన్న వారి నటించిన సినిమాలు ఏవి స‌క్స‌స్ రాక‌పోవడంతో హీరోయిన్లను.. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ పక్కన పెట్టేస్తారు. కానీ మరి కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఏవో కారణాలతో మంచి ఆఫర్లను కూడా మిస్ చేసుకుంటారు. అలాంటి వారిలో హోమ్లీ బ్యూటీగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న మీరాజాస్మిన్ ఒక‌టి. తెలుగులో అతి తక్కువ సినిమాల్లో నటించిన మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది మీరా. అమ్మాయి బాగుంది సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమాలోని నటించి మెప్పించింది.

Gudumba ShankarTelugu Movie Cast and Crew | Clapnumber

అయితే మొదట సైన్ చేసి నటించింది గుడుంబా శంకర్ సినిమా అయినా.. శివాజీ తో జంటగా నటించిన అమ్మాయి బాగుంది సినిమా మొదటి రిలీజ్ ఏ మంచి సక్సెస్ అందుకుంది. ఇక పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సాంగ్స్ హైలెట్గా నిలిచిన.. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో అమ్మాయి బాగుంది మూవీ ప్రొడ్యూసర్ పైడి బాబు మాట్లాడుతూ మీరజాస్మిన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను సినిమా నిర్మించాలని అనుకున్న అమ్మాయి బాగుంది మూవీ ఓకే చేశా. హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటుండగా మీరాజాస్మిన్ గురించి ఎవరో చెప్పారు. టాలెంట్, అందం ఉన్న అమ్మాయి అంటూ చెప్పడంతో వెంటనే ఆమెను సెలెక్ట్ చేసేసాం.

Meera Jasmine Creates Her Own Magic | Meera Jasmine Creates Her Own Magic

అయితే ఆమెలో ఉన్న అతిపెద్ద మైనస్ యాటిట్యూడ్ చూపించడం. చాలామందికి ఆమె యాటిట్యూడ్ నచ్చలేదు. అందుకే ఆమెకి గ్లామర్ ఉన్న స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాలేదు. కేవలం మీరాజాస్మిన్ తో నటించిన స్టార్ హీరోలు ముగ్గురే పవన్ కళ్యాణ్, బాలయ్య, రవితేజ. బాలయ్యతో మహారధి సినిమాలో నటించిన మీరాజాస్మిన్.. రవితేజ తో భద్ర సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే మీరే జాస్మిన్ ఎలాంటి సినిమాలో నటించిన సెట్స్‌లో కాస్త పొగరుగా.. యాటిట్యూడ్‌గా బిహేవ్ చేస్తుందంటూ ప్రొడ్యూసర్ పైడి బాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇక చాలా కాలం క్రితం ఇండస్ట్రీకి దూరమైన మీరాజాస్మిన్ తాజాగా మరోసారి టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. శ్రీ విష్ణు సినిమాలో ఈమె ఓ కీలక పాత్రలో కనిపించనుంది.