ఇప్పటివరకు రాజమౌళి – బన్నీ కాంపోలో సినిమా రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి పాన్ ఇండియన్ సిరీస్ లతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని తెలుగు సినిమా ఖ్యాతి రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమా తెర‌కెక్కించి మరోసారి తెలుగు సినీ ఇండస్ట్రీ తలెత్తుకునేలా చేశారు. ఇక ఇప్పటివరకు ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడుగా మరో రికార్డ్ రాజమౌళి సొంతం. ఇవన్నీ రేర్ ఫీట్స్ అనడంలో సందేహం లేదు. ఇక సినిమా సినిమాకి అతని రేంజ్ పెరిగిపోతూనే ఉంది తప్ప ఎక్కడ డౌన్ ఫాల్ కాలేదు. కాగా ప్రస్తుతం హాలీవుడ్ లెవెల్‌లో ఇండియన్ సినిమాను తెరకెక్కించి సక్సెస్ కొట్టడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు జక్కన్న. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.

Mahesh Babu-Rajamouli Project's Bitter Reality! Will The Director Take  Forever To Release The Movie? - Filmibeat

అమెజాన్ ఫారెస్ట్‌లో సినిమా రూపొందించనున్నాడు. వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్ర కనిపించనుంది. ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం పాన్‌ ఇండియన్ స్టార్‌లుగా ఉన్న ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్‌ తో సినిమాలు తెర‌కెక్కించాడు. అలాగే రవితేజ, నాని, నితిన్, సునీల్ లాంటి హీరోలకు సూపర్ హిట్ లు ఇచ్చాడు. కానీ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరిద్దరు తాంబూల సినిమా తెరకెక్కుతుందన్న ప్రచారం కూడా ఎప్పుడు బయటకు రాలేదు. దీంతో బన్నీతో జక్కన్న మూవీ చేసే ప్రయత్నం చేయలేదు అంటూ సోషల్ మీడియాలో వాదన ఉంది. ఇక మగధీర సినిమాకు గీత ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత.. జక్కన్న డైరెక్షన్లో అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేయకుండా ఉంటాడా.. అనే డౌట్ కూడా కొందరిలో ఉంటుంది.

Pushpa 2 Allu Arjun Double Fees For This Film Reports Rashmika Mandanna And  Fahadh Faasil Starring Movie - Entertainment News: Amar Ujala - Pushpa  2:इतनी मोटी रकम लेकर 'फायर पुष्पा' बने अल्लू

నిజానికి రాజమౌళి.. బన్నీతో సినిమా చేయాలని భావించాడట. బాహుబలి సిరీస్ తర్వాత బన్నీ తోనే సినిమా చేయాల్సి ఉందని.. ఎందుకో అది వర్కౌట్ కాలేదని తెలుస్తుంది. మొదట అజిత్‌, అల్లు అర్జున్ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ చేయాలని ఆలోచించారట. అది కార్య రూపం దాల్చ‌లేదు. దీంతో ఇదే కథను సరికొత్తగా మలిచి ఆర్‌ఆర్ఆర్ సినిమా బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్‌గా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ జక్కన్న కాతాలో వేసుకున్నాడ‌ట‌. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు జ‌క్కన‌. ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి దాదాపు 34 ఏళ్ల సమయం పడుతుంది. ఈలోపు బన్నీ.. పుష్ప2 రిలీజై.. తర్వాత అట్లీ, సందీప్ రెడ్డివంగా సినిమాలను కూడా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ పూర్తయ్యాక అయినా రాజమౌళి – బన్నీ కాంబినేషన్లో సినిమా వస్తుందో లేదో చూడాలి.