సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు స్టార్‌సెలబ్రెటీల, ముద్దుగుమ్మల చిన్నప్పటి ఫొటోస్, గ్లామర్ షో పిక్స్, రేర్ ఫొటోస్ తెగ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అందలో భాగంగానే ఇప్పుడు ఒకప్పటి టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ టీనేజి పిక్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఇంతకి ఈ పై ఫోటోలో చూసిన అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే సెన్సేషనల్ హీరోయిన్గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. అందం, అభినయంతో కుర్రాళను కట్టు పడేసిన ఈ చిన్నది.. తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది.
అయితే తర్వాత అదే హవా కొనసాగించలేకపోయింది. తెలుగులో ఆడపదడప్ప సినిమాలో నటిస్తూ బాలీవుడ్ కి షిఫ్ట్ అయి.. అక్కడ వరస సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ బిజీ అయింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో చెప్పలేదు కదా.. తనే హీరోయిన్ అనిత హస్తనందిని. అదేనండి ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమా హీరోయిన్. అనిత ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతోపాటు.. వరస సినిమా అవకాశాలను దక్కించుకుంది. అయితే ఆ సినిమా లేవి ఊహించిన రేంజ్‌లో క్లిక్ కాలేదు. దీంతో కన్నడ, తమిళ్ భాషల్లోనూ పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని నటించింది.
2003లో థ్రిల్లర్ మూవీ కుచ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడే వరస సినిమాల్లో నటిస్తూ బిజీ అయింది. 2013లో బిజినెస్ మ్యాన్ రోహిత్ రెడ్డిని వివాహం చేసుకొని పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. ఇప్పుడిప్పుడే తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ప్రయత్నంలో బిజీ అయింది. కొన్నాళ్లుగా హిందీ బుల్లితెరపై పలు సీరియల్స్ లో మెరుస్తుంది. ఇప్పుడు తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. ప్రస్తుతం యంగ్ హీరో సుహాస్ నటిస్తున్న కొత్త ప్రాజెక్టులో కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులో మలయాళకుట్టి మాళవిక మనోజ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక సినిమా తర్వాత అమ్మడు టాలీవుడ్ లోను వరుస అవకాశాలను దక్కించుకోవడం ఖాయం అంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.