దేవరపై అంచనాలను రెట్టింపు చేసిన అనిరుథ్.. మూవీ బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తుందంటూ..!

కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కనున్న తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా.. సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ సినిమా ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. విడుదలకు ఇంక మూడు రోజులు మాత్రమే ఉన్న క్రమంలో.. మూవీ టీం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేశారు. సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో మేకర్స్ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ ని ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి నెల‌కొల్పింది. దానికి తోడు ఆర్‌ఆర్ఆర్ తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సినిమా కావడం.. దాదాపు ఈయన నుంచి సోలో సినిమా వచ్చి ఆరేళ్లు కావడంతో.. ఎన్టీఆర్ అభిమానులంతా ఈ సినిమాను థియేటర్‌లో చూడడానికి తెగ ఆరట పడుతున్నారు. ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడడం ఖాయం అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Devara First Single Fear Song Promo: Jr NTR and Anirudh Ravichander Mark Powerful Entries - WATCH

ఇప్పుడు ఈ నమ్మకాన్ని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ మరింత స్ట్రాంగ్ చేసేసాడు. తన సంగీతం అందించిన భారీ సినిమాల రిలీజ్‌కు ముందు.. పవర్ఫుల్ ఎమోజీలతో తన మార్క్ స్పెషల్ ట్రీట్ ను ఇస్తూనే ఉంటాడు. జైలర్, జవాన్, లియో సినిమాల రిలీజ్‌కి ముందు అనిరుధ్‌ ఇలాంటి ట్విట్ చేశారు. ఆ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అలా ఇప్పుడు దేవర రిలీజ్ కు ముందు కూడా అనిరుధ్‌ నుంచి అటువంటి ఇంట్రెస్టింగ్ ట్విట్ ఒకటి రిలీజ్ అయింది. దీంతో అభిమానులు అనిరుధ్‌ స్టాంప్ పడిందంటే.. ఎన్టీఆర్ దేవర బాక్స్ ఆఫీస్‌ను షేక్‌ చేయడం ఖాయం అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.