టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో లాంగ్ లెంత్‌తో పాన్ ఇండియా సినిమాలు వచ్చి సక్సెస్‌లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విధానం పాత సినిమాల నుంచి మొదలైంది. అలా ఇప్పటివరకు టాలీవుడ్ లో లాంగ్ లెంత్‌తో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని రికార్డ్ సృష్టించిన తెలుగు సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
దానవీరశూరకర్ణ
హిందూ పౌరాణిక సినిమా.. దానవీరశూరకర్ణ 1977లో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా 3గంటల 46 నిమిషాల నడివితో తెరకెక్కి మంచి స్సస్ అందుకుంది. ఈ సినిమా టాలీవుడ్ లో ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోనూ అతి ఎక్కువ రన్ టైం ఉన్న సినిమా.
లవకుశ
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన మరో పౌరాణిక సినిమా లవ కుశ. 3 గంటలు 28 నిమిషాల నడువితో తెరకెక్కిన ఈ సినిమాకు సి.ఎస్. రావు, అతని తండ్రి సి. పుల్లయ్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
పాండవ వనవాసవనవాసము
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా, సావిత్రి హీరోయిన్గా నటించిన మూవీ పాండవ వనవాసం. మూడు గంటల 18 నిమిషాల నడివితో తెరకెక్కిన ఈ సినిమా 1965లో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
పాతాళ భైరవి:
కె.వి రెడ్డి డైరెక్షన్లో.. ఇండియన్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 3 గంటల 15 నిమిషాల నడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది.
అల్లూరి సీతారామరాజు:
సూపర్ స్టార్ కృష్ణ హీరోగా.. తెరకెక్కిన 100వ సినిమా అల్లూరి సీతారామరాజు. ఈ సినిమా 3 గంటల 07 నిమిషాల తెంత్‌తో రిలీజ్ అయి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మాయాబజార్:
హిందూ ఏపిక్ హిస్టారికల్ మూవీ మాయాబజార్. 3 గంటల 04 నిమిషాలు నడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసింది.
ఆర్ఆర్ఆర్
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో.. నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. 3గంటల 2 నిమిషాలు రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేసింది.
అర్జున్ రెడ్డి:
సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ, షాలిని పాండే ప్రధాన పాత్రలో నటించిన మూవీ అర్జున్ రెడ్డి. ఆర్‌ఆర్ఆర్ తో సమానంగా 3గంటల 02 నిమిషాల నడివితో ఈ సినిమా రిలీజై మంచి సక్సెస్ అందుకుంది.