టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్న చిరంజీవి.. ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోలలో నెంబర్ 1గా నిలిచి మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు. అలాంటి చిరంజీవి కెరీర్‌లో ఓ సినిమా కథను.. ఇది కాపీ స్టోరీ.. ఈ సినిమాలో చేస్తే ఫ్లాప్ పక్క అంటూ కొంతమంది భావించారట. అయినప్పటికీ చిరంజీవి దానిని పట్టించుకోకుండా సినిమాలో నటించి ఇండస్ట్రియల్ హిట్ కొట్టాడంటూ వార్త వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో ఒకే సమయంలో ఒకేలాంటి స్టోరీలు తెరకెక్కి.. రెండు కథల్లోనూ కంటెంట్ బాగున్న.. ఆ సినిమాలు ప్లాప్ అయినా సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అలా గతంలో చిరంజీవి నటించిన ఓ సినిమా విషయంలోనూ తనకు ఫ్లాప్ తప్పదంటూ కొంతమంది హెచ్చరించారట. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు.. ఇంద్ర. టాలీవుడ్ ఇండస్ట్రియల్ హిట్గా నిలిచి బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకుని కలెక్షన్లతో రికార్డులు కలగొట్టిన ఈ సినిమా విషయంలో.. గతంలో ఓ పెద్ద చర్చ జరిగిందట. చిరంజీవిని హీరోగా అశ్విని దత్త్ ఓ సినిమా తీయాలని భావించాడట. దానికి బి.గోపాల్‌ను దర్శకుడుగా ఎంచుకున్నారు. ఇక చిన్ని కృష్ణ దగ్గర ఒక కథ ఉండడంతో.. దాన్ని సినిమా చేయాలని బి.గోపాల్‌కి సూచించారట. ఆయన కథ మొత్తం విని.. ఆ స్టోరీ నాకు నచ్చలేదు. నేను సినిమా తీయనని చెప్పేసారట.
దానితో పరుచూరి గోపాలకృష్ణ ఒకసారి.. బి గోపాల్ ను కలిసి.. నువ్వెందుకు ఆ సినిమా చేయను అన్నావ్ అని ప్రశ్నించారట. దానితో ఆయన నేను ఆల్రెడీ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అనే రెండు ఫ్యాక్షని సినిమాలను తరికెక్కించా. చిన్నికృష్ణ చెప్పిన కథ ఇంచుమించు అలానే ఉంటుంది. ఫ్యాక్షన్ స్టోరీనే.. ఇక ఇప్పటికే నేను చిరుతో మెకానిక్ అల్లుడు సినిమా చేసి ఫ్లాప్ తెచ్చుకున్నా.. మళ్లీ అతనితో ఇలాంటి అనుభవం ఎదుర్కోవడం నావల్ల కాదు. అందుకే చేయను అని చెప్పేసాడట. దీంతో పరుచూరి.. బాలకృష్ణతో నువ్వు సినిమా చేసావు. చిరంజీవితో కాదు కదా.. చిరుతో ఈ కథ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది అని కన్విన్స్ చేశాడట. దీంతో ఆయన కన్విన్స్ కావడం.. ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. అలా సేమ్ స్టోరీ అని వద్దన్నా కథతోనే.. చిరంజీవికి ఇండస్ట్రియల్ హిట్ ఇచ్చారు బి. గోపాల్. అలా ఇంద్ర ఆల్ టైం టాలీవుడ్ ఇండస్ట్రియల్ హిట్‌గా నిలిచిపోయింది.