తమిళ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు విక్రమ్. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం తంగలాన్ సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాల నెలకొన్నాయి. విక్రమ్ నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తన కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం గా నిలిచిపోతుందంటూ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో స్వయంగా ఈ హీరో వివరించాడు.
ఇక దానికి తగ్గట్టుగానే నెక్స్ట్ సినిమాలపై కూడా ఆయన ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్ ఇప్పటికే విక్రమ్‌తో సినిమా చేయాలని ఉద్దేశంతో ఉన్నాడట. ఇంతకీ ఆయన ఎవరూ అనుకుంటున్నారా.. సంపత్ నంది. ప్రస్తుతానికి సంపత్‌నంది శర్వానంద్‌తో ఒక సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసింది. ఈ సినిమా అయిన వెంటనే విక్రమ్‌తో ఎక్స్పరిమెంటల్ సినిమా చేయడానికి కథను సిద్ధం చేసుకున్నాడట.
ఇదిలా ఉంటే ఇప్పటికే విక్రమ్‌కి కథ కూడా వినిపించాడని.. ఆయన కథను విన్న తర్వాత తనకు కొంత సమయం కావాలని వివరించినట్లు తెలుస్తుంది. అయితే విక్రమ్ ఈ గ్యాప్‌లో ఏం ఆలోచించుకుంటాడో.. సంపత్ నంది సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో వేచి చూడాల్సిందే. ఇక మొత్తానికి ఇప్పటివరకు సంపత్‌నంది కమర్షియల్ సినిమాలను చేస్తూ స్టార్ట్ డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక విక్రమ్‌తో తన కథకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకొని ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వస్తాడా.. లేదా.. సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో వేచి చూడాల్సిందే.