బండ్ల గణేష్ ప్రొడ్యూస్ చేసిన మూడు సినిమాలకు ఆ స్టార్ హీరోయిన్‌నే తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో సినిమా తెరకెక్కి.. అది రిలీజ్ కావాలంటే చాలా మంది కష్టపడాల్సి ఉంటుంది. కొన్ని వేల మంది కష్టపడితే కానీ ఆ సినిమా థియేటర్స్ వరకు చేరుకోదు. ఈ క్రమంలో డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ వ‌ర‌కు అంతా సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్లడానికి ఎన్నో రకాల కష్టాలను చెవి చూడాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే కొందరు సక్సెస్ లు అందుకుంటే.. మరి కొందరు మాత్రం ఫెయిల్యూర్ గా మిగిలిపోతూ ఉంటారు. ఇదిలా ఉంటే.. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా నిలబడే ప్రయత్నాలు చేసిన బండ్ల గణేష్ తర్వాత ప్రొడ్యూసర్గా మారి గబ్బర్ సింగ్ లాంటి ఓ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ఫుల్ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత బండ్ల గణేష్ మరో ముగ్గురు స్టార్ హీరోస్‌తో మూడు సినిమాలను ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు స్టార్ హీరోల సినిమాల్లోను ఒకే హీరోయిన్ రిపీట్ చేస్తూ వచ్చాడు బండ్ల గణేష్. కాగా ప్రస్తుతం తాను ప్రొడ్యూస్ చేసిన ఆ మూడు సినిమాలకు ఒకే స్టార్ హీరోయిన్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణమేంటి అనే ప్రశ్న‌ నెట్టింట వైరల్ గా మారింది. మొదట పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈయన.. తర్వాత ఎన్టీఆర్ నటించిన బాద్షా, టెంపర్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఈ రెండు సినిమాలుకు కాజల్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ రెండు సినిమాలతో పాటు రామ్ చరణ్ హీరోగా వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమాలో కూడా తననే రిపీట్ చేశాడు బండ్ల గణేష్. ఇలా మూడు సినిమాల్లోనూ కాజల్‌నే హీరోయిన్ గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ బండ గణేష్‌కు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురుకాగా ఆయన రియాక్ట్ అవుతూ.. కాజల్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఆమె తీసుకునే రెమ్యూనరేషన్ కూడా మాకు చాలా అనుకూలంగా అనిపిస్తుంది. అందుకే ఆమెనే నా ప్రతి సినిమాల్లో హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నాను అంటూ వివరించాడు. అలాగే మా సినిమాల్లో పాత్రలు కూడా ఆమెకు సరిగ్గా సరిపోయే విధంగా ఉండ‌టంతో డైరెక్టర్స్ కూడా ఆమెను తీసుకోవడానికి ఇష్టపడ్డారు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బండ్ల‌ గణేష్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవుతున్నాయి.