డ‌బుల్ ఇస్మార్ట్ కు రిలీజ్‌కు ముందే క‌ష్టాలు

టాలీవుడ్ డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్ రామ్ ల కాంబినేషన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ కు సీక్వెల్ గా రూపొందిన ‘డబల్ ఇస్మార్ట్’ ఈనెల ఆగష్టు 15న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటి వరకు పెద్దగా అంచనాలు ప్రేక్షకులలో లేకపోవడం ఈ సినిమా బయ్యర్లను బాగా టెన్ష‌న్ పెడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే ఈ సినిమాకు ముందు పూరి జ‌గ‌న్ విజ‌య్ దేవ‌ర కొండ హీరోగా డైరెక్ట్ చేసిన లైగ‌ర్ సినిమా పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ సినిమా భారీ నష్టాల తలనొప్పులు ఇప్పుడు కూడా పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మీల‌ను వెంటాడుతున్నాయట‌. లైగర్ వల్ల ఘోరంగా నష్టపోయిన బయ్యర్లను ఆదుకుంటామని పూరీ గతంలో ఆ సినిమా కొన్న బ‌య్య‌ర్ల‌కు ఇచ్చిన మాట ఇప్పుడు పూరీని వెంటాడుతున్నాయంటున్నారు.

అయితే ఆ లెక్క వేరే.. అది ఎప్పుడో సెటిల్ అయ్యింద‌ని పూరి వైపు వాద‌న‌గా అంటున్నారు. మ‌రి ఇందులో వాస్త‌వం ఎంతో పూరితో పాటు లైగ‌ర్ కొన్న బ‌య్య‌ర్ల‌కే తెలియాలి. ఇక ‘డబల్ ఇస్మార్ట్’ మూవీని ఒక ప్రముఖ బయ్యర్ 60 కోట్లకు కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే రోజు ర‌వితేజ – హ‌రీష్ శంక‌ర్ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ కూడా రిలీజ్ అవుతోంది. దీంతో డ‌బుల్ ఇస్మార్ట్‌కు గ‌ట్టి పోటీ అయితే త‌ప్ప‌దు.