టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్.. రామ్‌పోతినేని హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. నాగ్‌అశ్విన్ దర్శకుడిగా తెరకెక్కిన మహానటి సినిమాతో సాహజ నటిగా నేషనల్ అవార్డ్ దక్కించుకోవడమే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకుంది ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. రెమ్యూనరేషన్ పరంగా కూడా భారీ స్థాయిలో కొనసాగుతుంది.
అయితే తాజాగా కీర్తి సురేష్ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి. కీర్తి సురేష్.. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తారక్ తో జోడి బాగుంటుందని కీర్తి సురేష్ వివరించింది. ఎన్టీఆర్ పై తనకు ఉన్న అభిమానాన్ని మీడియాతో వివరిస్తూ.. మహానటి మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ లో నేను తారక్‌ను కలిశానని.. మొదటిసారి నేను తారక్‌ను అక్కడే చూశానంటూ చెప్పుకొచ్చింది. ఒక్కసారైనా జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పని చేయాలని ఉందని.. ఒకే ఒక్క అవకాశం వస్తే అతనితో జోడి కట్టాలని కోరుకుంటున్నట్లు కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తి అని అతనితో సినిమా అవకాశం వస్తే బాగుంటుందని.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ప్రస్తుతం కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోని భారీ పాపులారిటీతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రేక్షకుల సైతం జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా అవుతున్నారు. ఇలాంటి క్రమంలో కీర్తి సురేష్ చేసిన కామెంట్స్‌తో.. జూనియర్ ఎన్టీఆర్, కీర్తి సురేష్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కితే బాగుండని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్.. కీర్తి సురేష్‌తో జంటగా నటించిడానికి ఒక్క సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తారక్.. కీర్తి సురేష్ కు అవకాశం ఇస్తాడో లేదో వేచి చూడాలి.