నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ హీట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం బాబి డైరెక్షన్‌లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో బాలయ్య కోసం బాబీ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలయ్య కోసం ఏకంగా ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్ ను రంగంలోకి దింపుతున్నాడట బాబి. బాలయ్య సినిమాలో యాక్షన్ తో పాటు రొమాన్స్ టచ్ కూడా ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఒకే సినిమాలో ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్‌తో బాలయ్య రొమాన్స్ అంటే బాలయ్య అభిమానులకు పూనకాలు రావడం పక్కా అనడంలో సందేహం లేదు.
ఇక బాలయ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన తన 109వ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే ఎన్నో డిఫరెంట్ లొకేషన్స్‌లో సినిమా షూటింగ్ జరుపుతున్న మేకర్స్.. ప్రస్తుతం రాజస్థాన్‌లో కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. బాలయ్యతో పాటు కొంతమంది కీలక పాత్రధారులు కూడా ఈ షూట్‌లో పాల్గొని సందడి చేస్తున్నారు. అయితే నందమూరి హీరో సరసన ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్ రొమాన్స్ చేయబోతున్నారంటూ.. ఆల్రెడీ ఈ ముగ్గురు హీరోయిన్స్ కూడా షూట్ లో పాల్గొన్నారంటూ వార్తలు విఇనిపిస్తున్నాయి. ఇంతకి ఆ ముగ్గురు కత్తి లాంటి ఫిగర్స్ ఎవరో చెప్పనేలేదుకదా.. ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెల. ఇక ఇప్పటికే బాలయ్య ప్రగ్యా జైస్వాల్ తో అఖండ సినిమాలో జతకట్టిన సంగతి తెలిసిందే.
శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశీరౌతెలతో మొదటిసారి బాలయ్య స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. అయితే ఊర్వశి రౌతెల.. బాబి గత సినిమా వాల్తేరు వీరయ్యలో చిరంజీవి సరసన ఐటమ్ సాంగ్ లో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్‌తో బాలయ్య రొమాన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశి ప్రొడ్యూసర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కూడా త్వరలోనే అనౌన్స్ చేయనున్నారట మేకర్స్. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ నెట్టింట వైరల్ కావడంతో పాటు అభిమానుల్లో మరింత హైప్‌ను క్రియేట్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.