నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బచ్చిన క్షణాలో వైరల్‌గా మారుతుంది. ఇక మొదట ఈ సినిమాను సింగల్ పార్ట్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా.. తర్వాత రెండు భాగాలుగా దేవర రిలీజ్ అవుతుంది అంటూ కొరటాల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్. కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఇక ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.
ఈ నేపద్మయంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు అప్డేట్స్ సోషల్ మీడియాలో అందిస్తూ తారక్ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులో జోష్ నింపుతున్నారు మేకర్స్.ఇందులో బాగంగా ఇప్పటికే ఫియర్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక కొద్ది క్షణాల క్రితం ఈ సినిమా సెకండ్ సింగిల్ రిలీజైంది. ఈ సాంగ్ ప్రస్తుతం నెటింట వైరల్‌గా మారింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సెకండ్ సింగిల్‌లో ఎన్టీఆర్ సరసన జాన్వీ సింపుల్ స్టెప్స్ తో అదరగొట్టింది. ఈ సాంగ్ ఎలా ఉందో మీరు ఓ లుక్ వేసేయండి.