నందమూరి బాలకృష్ణ నటవరసడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తాడంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులంతా కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ అంటే ఎలాంటి జోనర్‌లో సినిమా తెరకెక్కుతుంది.. మోక్షజ్ఞ నటన ఎలా ఉండబోతుంది.. ఆనే ఆసక్తి ప్రేక్షకులో నెలకొంది. ఈ క్రమంలో జాంబిరెడ్డి, హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ డబ్ల్యూ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా చాలా విభిన్నమైన జోనర్‌లో తెరకెక్కబోతుందని టాక్. ఇందులో వినూత్నమైన విజువల్స్, స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ప్రశాంత్ వర్మ మెప్పించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. గతంలో ఏ సినిమాలోనూ లేని విధంగా ఈ సినిమా విజువల్స్ ఉండబోతున్నాయని టాక్. ఈ క్రమంలో సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అనే అంశంపై కూడా నెటింట పలు వార్తలు వైరల్ గా మారాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య తనయుడు మూవీ కోసం ఓ స్టార్ హీరోయిన్ చెల్లెలిని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు జాన్వి కపూర్.
దివంగత అతిలోకసుందరి శ్రీదేవి.. పెద్ద కూతురు జాన్వి కపూర్. హీరోయిన్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్తో పాటు టాలీవుడ్ లను పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. పాన్ ఇండియన్ స్టార్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఈ క్రమంలో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ మోక్షజ్ఞ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని టాక్. జాన్వీ చెల్లెలు ఖుషి కపూర్ మోక్షజ్ఞ శరసన హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందని వస్తున్న ఈ వార్తలు నిజమైతే.. శ్రీదేవి ఇద్దరు కూతుర్లని నందమూరి హీరోలే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన రికార్డ్ సొంతం చేసుకుంటారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.