టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో నెంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతున్నాడు బాలకృష్ణ. బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్న బాలయ్య.. కెరీర్ పరంగా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇప్పటికే బాలయ్య ఎంతోమంది స్టార్ డైరెక్టర్స్‌కు అవకాశాలు ఇచ్చిన సంగతి తెలిసింది. కాగా కెరీర్ మొదట్లో బాలయ్య సినిమాలకు దర్శకత్వం వహించిన వారిలో కోదండరామిరెడ్డి కూడా ఒకడు. బాలయ్య, కోదండరామిరెడ్డి కాంబోలో అనసూయమ్మ గారి అల్లుడు సినిమాతో పాటు ఇంకా ఎన్నో సినిమాలు తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్నాయి. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో బాలయ్య క్యారెక్టర్ ఇలానే ఉండేదంటూ డైరెక్టర్ కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.
ప్రస్తుతం కోదండరామిరెడ్డి చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి. సీనియర్ ఎన్టీఆర్ నన్ను ఎంతగానో నమ్మేవారని.. అలా బాలయ్య కోసం ఒక మంచి కథ తయారు చేసి ఇవ్వాలంటూ మొదట్లో నన్ను కోరారు అని చెప్పుకొచ్చాడు. నేను బాలయ్య కోసం ఓ స్టోరీని రెడీ చేయగా ఎన్టీఆర్‌కు ఆ కథ బాగా నచ్చేసిందని. వెంటనే ఆ స్క్రిప్ట్ నే.. బాలయ్యతో అనసూయమ్మ గారి అల్లుడు టైటిల్‌తో తెరకెక్కించామని కోదండరామిరెడ్డి వివరించాడు. ఇక బాలయ్య గురించి మాట్లాడుతూ.. బాలయ్య గోల్డెన్ స్కూల్ తో పుట్టినా, సీనియర్ ఎన్టీఆర్ కొడుకుగా ఉన్న ఆయనలో కాస్తయినా గర్వం కూడా ఉండదని కోదండరామిరెడ్డి చెప్పుకొచ్చాడు.
బాలయ్య సెట్స్ లో అందరికీ నమస్కారం చేస్తూ గౌరవభావంతో ఉంటాడని.. సొంత బ్యానర్ లో సినిమా తెరకెక్కితే టీ తాగారా, భోజనాలు చేశారా అని కూడా ఆప్యాయంగా అడిగేవాడని చెప్పుకొచ్చాడు. ఇక సెట్ లో అందరితో కలిసి భోజనం చేయడానికి ప్రయత్నించే వారిని.. అనువంతైన ఆయనలో గర్వం ఉండేది కాదంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాలయ్య గురించి కోదండరామిరెడ్డి చేసిన కామెంట్స్ నెటింట దెరల్‌గా మారడంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మా బాలయ్య మనస్సు వెన్న అంటూ.. అది బాలయ్య మంచి మనస్సు అంటూ తెగ పొగిడేస్తూ.. కోదండరామిరెడ్డి చేసిన కామెంట్స్‌ను మరింత వైరల్ చేస్తున్నారు.