అక్కినేని అందగాడు నాగార్జున నట వారసుడుగా అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హీరో అఖిల్ ఇప్పటికే పలు సినిమాలో నటించాడు. ఇక హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే అక్కినేని ఫ్యామిలీ కోసం మనం సినిమాలో గెస్ట్ గా కనిపించి మెప్పించాడు.. చివరిలో ఎంట్రీ ఇచ్చి ఠక్కున మాయమవుతాడు. ఆ తర్వాత సోలో హీరోగా అఖిల్ టైటిల్‌తో సినిమాల్లో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్యన రిలీజై డిజాస్టర్ గా నిలిచింది. తర్వాత హాల్లో సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోయింది.
తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్ లో మిస్టర్ మజ్ను.. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా వచ్చీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యావరేజ్ టాక్ దక్కించుకుంది. దీంతో అఖిల్ మెల్లగా ట్రాక్‌లో పడ్డడని అక్కినేని ఫ్యాన్స్ అనందపడేలోపు సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో భారీ బడ్జట్‌తో ఎజేంట్ సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. అయితే.. అఖిల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవక్క ముందే ఒక షార్ట్ ఫిలిం లో నటించిన సంగతి చాలా మందికి తెలియదు. ఈ షార్ట్ ఫిలింలో అక్కినేని హీరో అఖిల్ జంటగా మెగా డాటర్ నిహారిక హీరోయిన్గా నటించిందట. ఇక గతంలో విశ్వక్సేన్ తో కలిసి ఓ షార్ట్ ఫిలిం లో నటించిన నిహారిక.. అఖిలతో షార్ట్ ఫిలిం లో నటించిందని స్వయంగా తనే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ని వెల్లడించింది.
నేను అఖిల్ కలిసి ఓ షార్ట్ ఫిలిం లో నటించామని.. ఆ సినిమాకు కార్తికేయ దర్శకత్వం వహించాడు అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇక్కడ టంవిస్ట్ ఏంటంటే ఈ షార్ట్ ఫిలిం రాజమౌళి చూసి దీనిని రిలీజ్ చేయకపోవడం మంచిది అన్నారట.. దీంతో ఆ షార్ట్ ఫిలిం అసలు రిలీజ్ కాలేదు. ఇక విశ్వక్ సేన్‌తో కూడా ఓ షార్ట్ ఫిలిం అనుకున్నామని.. కానీ అది సాంగ్‌గా రిలీజ్ అయిందని చెప్పుకొచ్చింది నిహారిక. ప్రస్తుతం నిహారిక చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. అఖిల్ నిహారిక కలిసి ఓ షార్ట్ ఫిలిం లో చేశారా అంటూ షాక్ అవుతున్నారు.