పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ హీరోస్ భారీ లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సౌత్ లో తమిళ్, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలో ఉన్న టాలీవుడ్ రేంజ్‌లో ప్రభావం మాత్రం ఇతర ఏ ఇండస్ట్రీలు బాలీవుడ్ పై చూపించలేకపోతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో తమిళ్ హీరోలు పూర్తిగా వెనుకబడిపోయారని టాక్ కూడా నడుస్తుంది. మన హీరోలు మాత్రం అక్కడ సక్సెస్‌లు అందుకుంటూ మరింత పాపులారిటి దక్కించుకుంటూ అక్కడ కూడా స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. దానికి కారణం మన కథలో వైవిద్యత చూపిస్తూ.. అంతే ఇంటెన్స్ తో తమ నటనతో ప్రేక్షకులను మెప్పించడమే అనడంలో సందేహం లేదు.
మన వాళ్లు ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో నటిస్తూ ఉంటారు. కనుక యాక్షన్ ఎపిసోడ్స్ వాళ్లకు విపరీతంగా నచ్చి ఫైనల్ గా మన సినిమాలను సక్సెస్ చేస్తున్నారు అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లోనే తెలుగు సినిమా టాప్ లెవెల్ లో ఉన్న సంగతి తెలిసిందే. రాబోయే సినిమాలతో కూడా భారీ సక్సెస్ లో అందుకొని ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇమేజ్ మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఇలా పాన్ ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ పైనే డిపెండ్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్న సినిమాలు ఎలాగైనా సక్సెస్ సాధిస్తే టాలీవుడ్ నెంబర్ వన్‌గా దూసుకుపోతోంది అనడంలో సందేహం లేదు.
అందులో భాగంగానే ప్రస్తుత ఎన్టీఆర్.. దేవర, అల్లు అర్జున్.. పుష్ప 2, పవన్ కళ్యాణ్.. ఓజి, రామ్ చరణ్.. గేమ్ చేంజరట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ స్టార్ హీరోల సినిమాలపై ప్రమోషన్స్ నిర్వహించకపోయినా.. ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకుల్లో సినిమాలపై మంచి అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాల కోసం ఎప్పటినుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నాలుగు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయిన సూపర్ హిట్లు కావడం ఖాయం. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోలు అవ్వాలంటే తారక్, పవన్ , బన్నీ, చరణ్ కి మాత్రమే సాధ్యమంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.