మురారి మూవీ రీ రిలీజ్.. భారీ హైప్ కు కారణం అదేనా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తను నటించిన సినిమాలతో ప్రేక్ష‌కులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న మహేష్.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఆగస్టు 9న ఆయన పుట్టిన రోజన్న సంగతి చాలా మందికి తెలుసు. ఈ క్రమంలో మహేష్ పుట్టినరోజును పురస్కరించుకుంటూ మురారి సినిమాను రీరిలీజ్‌ చేయబోతున్నట్లు వార్తలు నెట్టింట వార్తలు వైరల్ గా మారాయి.
Okkadu - Wikipedia
ఈ క్ర‌మంలో సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో మరోసారి ఈ సినిమాను చూద్దామా అంటూ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్స్ కూడా వైవిధ్యంగా ఎన్నో రూపాల్లో చెస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా భారీ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమంటూ తెలుస్తోంది. మహేష్ సినీ కెరీర్‌లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచిన ఈ సినిమా.. ఇప్పుడు రిలీజై మరోసారి అదే రేంజ్‌లో వసూళ‌ను కొల్లగొట్టి మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని.. రీ రిలీజ్ ట్రెండ్‌కు స‌రికొత్త అర్థం చెప్పబోతుందని సమాచారం.
19 Years for Classic Murari: Check out why the Mahesh Babu starrer was  loved by audience?
ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలు రీ రిలీజ్‌తో భారీ వ‌సూళ్ళు రాబడుతున్న సంగతి తెలిసిందే. అలాగే మహేష్ బాబు సినిమాలు కూడా అదే రేంజ్‌లో కలెక్షన్లను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నాయట. ఇక ఆగస్టు 9న మొదటి రెండు షోలు ఒక్కడు సినిమాని.. మరో రెండు షోలు మరారి సినిమాని ప్లే చేయనున్నారని తెలుస్తుంది. అయితే ఒక్కడుకి, మురారి సినిమాకు వచ్చినంత హైప్ అయితే ప్రేక్షకుల్లో లేదు. మురారి సినిమా రిలీస్ పై ప్రేక్షకులం మంచి స్పందన వినిపిస్తుంది. కృష్ణవంశీ డైరెక్షన్లో బ‌చ్చిన‌ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడమే కాదు.. మహేష్, కృష్ణవంశీ కెరియర్ కు మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. మరి ఈ సినిమా ఇప్పుడు ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.