టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కు టాలీవుడ్ ప్రేక్షకులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట ఈ జంట ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు అకిరా, అధ్య అనే పిల్లలు కూడా ఉన్నారు. ఇక కొడుకు అకీరా ఇప్పటికే టాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమయ్యాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక రేణుదేశాయ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోను పలు ఇంటర్వ్యూల్లో సందడి చేస్తూ ఆమెకు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడే ప్రతిసారి ఆఖీరా గురించి ఆద్య గురించి ఆమెకు ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి.
రేణు దేశాయ్ తరచుగా సోషల్ మీడియాలో తన పిల్లలు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పోస్ట్లు పెడుతూ ఉండడంతో రేణు దేశాయ్ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని.. వారిద్దరి మధ్యన ప్రేమ చావలేదంటూ.. అందుకే రేణు దేశాయ్ ఇప్పటికి పవన్ కళ్యాణ్ ను తలుచుకుంటుందంటూ కామెంట్లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో రేణు దేశాయ్‌క సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. బద్రి సినిమాతో ఏర్పడిన పరిచయంతో తర్వాత పవన్ – రేణు దేశాయ్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. కొంతకాలం సహజీవనం తర్వాత ఆఖీరా పుట్టాక వీరిద్దరు వివాహం చేసుకున్నారు. జానీ సినిమాలోను కలిసిన నటించారు.
ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి లాంటి సినిమాకు రేణు దేశాయ్ ఎడిటర్‌గా వ్యవహరించింది. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రేణు ఇప్పటికీ పవన్ కళ్యాణ్, అకిరా, ఆధ్యకు సంబంధించిన ఎన్నో పోస్ట్లు షేర్ చేసుకుంది. అవి క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతుండటంతో.. పవన్ కళ్యాణ్‌ను రేణు దేశాయ్ మర్చిపోలేదు అంటూ వస్తున్న కామెంట్లపై ఆమె ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ.. సీరియస్ వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా రేణు దేశాయ్ ఖుషి సినిమాకు సంబంధించిన ఏమేరా జహ సాంగ్ క్లిప్ ను పోస్ట్ చేస్తూ ఈ సాంగ్ కి ఎడిటర్ గా తానే పనిచేశానని చెప్పుకొచ్చింది. నేను ఫస్ట్ టైం 21 ఏళ్ల వయసులో ఈ సాంగ్ లో ఎడిట్ చేశానని.. నా మొదటి పాట ఇదే.. ఇప్పటికీ ఈ పాటలో ప్రతి ఒక్క ఫేమ్ నాకు గుర్తుంది. ఎప్పటికీ మర్చిపోలేను అంటూ రేణు దేశాయ్ వివరించింది. ఇక పవన్ కళ్యాణ్ తో కలిసి తన 21 ఏళ్ల వయసులోనే ఎడిట్ చేసిన మొట్టమొదటి సాంగ్ ఇదే అంటూ ఆమె పోస్ట్ చేసిన పిక్ నెటింట తెగ వైరల్ గా మారింది.