కేవలం ఆ ఒక్క స్టెప్ కోసం ఎన్నో గంటలు కష్టపడ్డా.. పుష్ప 2పై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత యానిమల్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు.. ఇతర పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా గడుపుతున్న రష్మిక.. కెరీర్ పట్ల ఎంతో బిజీగా మారిపోయింది. ఇక తాజాగా రిలీజ్ అవుతున్న ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమానికి ఈ హాట్ బ్యూటీ స్పెషల్ గెస్ట్ గా హాజరు అయ్యింది. ఈ ఈవెంట్లో భాగంగా పుష్ప 2 గురించి మాట్లాడుతూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను రివిల్ చేసింది.

Allu Arjun To Get Going For Pushpa The Rule | cinejosh.com

పుష్పా సినిమా ద్వారా పాన్ ఇండియన్ స్టార్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. తన నటన, డ్యాన్స్ తో ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారి దూసుకుపోతుంది. ఇక ఇప్పటివరకు పుష్పా సీక్వెల్‌గా తెరకెక్కుతున్న పుష్ప 2 పై వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను భారీ లెవెల్‌లో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ నుంచి స్టార్టింగ్‌లో రిలీజ్ అయిన టీజ‌ర్ వరకు ప్రతిదీ ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఇండియన్ ఐడెల్‌లో రష్మిక మాట్లాడుతూ.. ఈ సినిమా సాంగ్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్‌ చేసుకుంది. ఇందులో పాట కోసం తను కొన్ని గంటల పాటు శ్రమించాన‌ని చెప్పుకొచ్చింది.

Pushpa: The Rule - Part 2 (2024) - IMDb

ఒక్క పాటలో భాగంగా కెమెరా లెన్స్ ముందు హాండ్స్ తో మూమెంట్స్‌ చేయాల్సి వచ్చిందని.. ఆ స్టెప్ కోసం ఎన్నో సార్లు ట్రై చేసినా అది సరిగ్గా కుదరలేదంటే చెప్పుకొచ్చింది. ఇక సుకుమార్ ప్రతి చిన్న విషయంలోనూ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారని.. ఈ క్రమంలో ఆ చిన్న స్టెప్ పర్ఫెక్ట్ గా రావడం కోసం ఎంతో కష్టపడ్డానంటూ వివరించింది. ఇక పుష్పతో పోలిస్తే పుష్ప 2 మరింత అద్భుతంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ఆమె చేసిన ఈ కామెంట్స్ నెటింట‌ వైరల్ అవ్వడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ పెరిగింది. ఇక మొదట ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కావలసి ఉండగా.. డిసెంబర్ 6 కు ఈ సినిమా పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే.